మూడు దశాబ్ధాల తర్వాత మళ్లీ ఆ ఇద్దరు!
బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' రిలీజ్ తర్వాత సైలెంట్ అయిన సంగతి తెలిసిందే
బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' రిలీజ్ తర్వాత సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. మళ్లీ కొంత గ్యాప్ అనంతరం ఇటీవలే యాక్టివేట్ అయ్యారు. మధ్య లో 'సల్మాన్ వెంకీ'లో గెస్ట్ అపిరియన్స్ ఇవ్వగా..'లా పట్టా లేడీస్' చిత్ర నిర్మాతగానూ కనిపించారు. ఇటీవలే ఆయన హీరోగా 'సితారే జెమీన్ ప్యార్' చిత్రాన్ని కూడా ప్రకటించడంతో అమీర్ మళ్లీ సీన్ లోకి వచ్చినట్లు అయింది.
ఈ సినిమాకి కూడా అమీర్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ఆర్ .ఎస్ ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ప్రాజెక్ట్ కూడా కన్పమ్ చేసారు. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషీ తో మరో సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఇద్దరి కాంబినేషన్ లో మూడు దశాబ్దాల తర్వాత వస్తోన్న సినిమాగా తెలుస్తుంది.
రాజ్ కుమార్ కెరీర్ ఆరంభంలో తన మూడవ సినిమా 'దామిని' ని అమీర్ హీరోగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇది 1993 లో రిలీజ్ అయింది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. దీంతో అమీర్ ఖాన్ మళ్లీ అదే దర్శకుడితో అదే ఏడాది ' 'అంజాద్ అప్నా అప్నా ' పట్టాలెక్కించి 1994లో రిలీజ్ చేసారు. ఇది కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి సినిమా చేసింది లేదు.
అప్పటి నుంచి ఇప్పటివరకూ రాజ్ కుమార్ ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమా చేసారు. అమీర్ కూడా అదే ధోరణిలో సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దర్నీ 2024 ఒకే తాటిపైకి తీసుకొచ్చింది. హాస్యం, సామాజిక సందేశంతో ఈసినిమా చేస్తున్నట్లు దర్శకుడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాజ్ కుమార్ 'లాహోర్ 1947'ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని అమీర్ఖాన్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇలా ఇద్దరు కలిసి సినిమా చేయడంతోనే మళ్లీ ఆ కాంబోలో సాధ్యమైంది.