రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ కేసు పెట్టిన గర్ల్ ఫ్రెండ్ లావణ్య!
అయితే ఆ మూడు సినిమాల తర్వాత రాజ్ తరుణ్ కి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రాలేదు.
ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా అడుగుపెట్టిన రాజ్ తరుణ్ తరువాత కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్త మామా మూవీస్ తో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస అవకాశాలు అందుకుంటూ వచ్చాడు. అయితే ఆ మూడు సినిమాల తర్వాత రాజ్ తరుణ్ కి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రాలేదు.
వరుసగా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. చివరిగా రాజ్ తరుణ్ కింగ్ నాగార్జున నా సామిరంగా మూవీలో కీలక పాత్రలో నటించాడు. అలాగే ఓటీటీ ఆహా నా పెళ్ళంటా వెబ్ సిరీస్ తో మళ్ళీ లైన్ లోకి వచ్చాడు. ఇదిలా ఉంటే ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో చేసిన తిరగబడర సామి మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ ట్రైలర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో పాటుగా పురుషోత్తముడు అనే మూవీ కూడా రాజ్ తరుణ్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రాజ్ తరుణ్ పై అతని ప్రియురాలు లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తో 11 ఏళ్ళ నుంచి సహజీవనం చేస్తున్నానని, అయితే గత కొంతకాలం నుంచి నన్ను దూరం పెట్టాడని లావణ్య ఫిర్యాదులోపేర్కొంది.
మేమిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. అయితే రాజ్ తరుణ్ తన కొత్త సినిమాలో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని నన్ను వదిలేసాడు. మూడు నెలలుగా మొహం చాటేశాడు. ఇంటికి రావడం లేదు. నాతో పరిచయం లేనట్లు బిహేవ్ చేస్తున్నాడు. అతని బంధువులు ఫోన్ చేసి రాజ్ తరుణ్ ని వదిలేయాలని బెదిరిస్తున్నారు అని లావణ్య ఫిర్యాదులో రాసుకొచ్చింది.
గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి 45 రోజులు తాను జైల్లో ఉన్నాను. ఆ సమయంలో రాజ్ తరుణ్ నాకు ఎలాంటి సహాయం చేయలేదు. నన్ను శారీరంగా వాడుకొని 11 ఏళ్ళు సహజీవనం చేసిన రాజ్ తరుణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదుపై రాజ్ తరుణ్ ఇప్పటి వరకు స్పందించలేదు. అతని నుంచి ఎలాంటి స్పందన వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య మరల సినిమాల పరంగా మంచి కథలు ఎంచుకొని రాజ్ తరుణ్ బిజీ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో అతనిపై ఈ కేసు ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది చూడాలి.