రకుల్‌ ఎకో ఫ్రెండ్లీ పెళ్లి పుకార్లు

అయినా కూడా సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌ గా వార్తల్లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది.

Update: 2024-02-14 12:52 GMT

టాలీవుడ్‌ తో పాటు బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌ గా నిలిచిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. బాలీవుడ్ లో ఆ మధ్య వరుసగా సినిమాల్లో నటించే ఆఫర్లు వచ్చాయి. కానీ అవి పెద్దగా హిట్స్ ను తెచ్చి పెట్టలేదు.

మొత్తానికి రకుల్‌ ప్రీత్‌ సింగ్ టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో ఇంతకు ముందు మాదిరిగా సినిమాల్లో చాన్స్ దక్కించుకోలేక పోతుంది. అయినా కూడా సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌ గా వార్తల్లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది.

ఈ అమ్మడు గత కొంత కాలంగా జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరి వివాహం ను ఫిబ్రవరి 22న జరిపేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. గోవాలో జరగబోతున్న డెస్టినేషన్ వెడ్డింగ్‌ తో రకుల్‌, జాకీ భగ్నానీ ఒక్కటి అవ్వబోతున్నారు.

గోవా డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా రకుల్‌ తన వెడ్డింగ్‌ ను ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్‌ తో జరుపుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్లాస్టిక్ వాడకుండా, క్రాకర్స్ కాల్చకుండా తన వెడ్డింగ్ జరుపుకోవాలని భావిస్తుందట.

ఈ మధ్య కాలంలో పెళ్లి అంటే హడావుడి ఎక్కువ అయ్యింది. ఆ సమయంలో పర్యావరణం కి తీవ్రంగా దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారు. రకుల్‌ ఎకో ఫ్రెండ్లీ పెళ్లి కాన్సెప్ట్‌ ను తీసుకు రావడం నిజంగా అభినందనీయం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News