రకుల్ వెడ్డింగ్ కార్డు డిజైన్ మాల్దీవుల లొకేషన్!
మరి ఇంత జరుగుతున్నా ఇంకా పెళ్లి కార్డు బయటకు రాలేదేంటి? అని అభిమానుల గుస గుస మొద లైంది.
కొన్ని రోజులుగా రకుల్ ప్రీత్ సింగ్ వివాహం అనే ఉత్సాహంలో మునిగి తేలుతోన్న సంగతి తెలిసిందే. మనసిచ్చిన చెలికాడుతో జీవితాన్ని పంచుకునే క్షణాల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. జాకీ భగ్నానీతో ఫిబ్రవరి 21ని గోవాలో నిరాడంబరంగా వివాహం జరుగుతుంది. ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యలులు.. సన్నిహి తులు..అతికొద్ది మంది స్నేహితుల సమక్షంలో జరుగుతుంది.
పెళ్లి సమయం దగ్గర పడటంతో ఆ రెండు కుటుంబాలు ఆ పనుల్లోనే బిజీగా ఉన్నాయి. పెళ్లికి అవసరమైన షాపింగ్ ప్రోసస్ లో భాగంగా వదువరూలిద్దరు బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని ఆ జోడీ ఆస్వాదిస్తోంది. ఇటీవలే థాయ్ లాండ్ స్నేహితులకు రకుల్ గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన సంగతి తెలి సిందే. రన్నింగ్ బోట్ లో పార్టీ ఆస్వాదిస్తోన్న ఫోటోల్ని అభిమానులతోనూ షేర్ చేసుకుంది.
మరి ఇంత జరుగుతున్నా ఇంకా పెళ్లి కార్డు బయటకు రాలేదేంటి? అని అభిమానుల గుస గుస మొద లైంది. ఒకవేళ ఎలాంటి కార్డు లేకుండానే వివాహం చేసేసుకుంటున్నారా? అన్న సందేహాలు మొదల య్యాయి. తాజాగా వాటన్నింటికి తెర దించుతూ రకుల్ ప్రీత్ సింగ్ వెడ్డింగ్ కార్డును కూడా షేర్ చేసింది. అమ్మడు వెడ్డింగ్ కార్డుని తన టేస్ట్ కి తగ్గట్టు డిజైన్ చేసింది. వెడ్డింగ్ కార్డ్ పై మాల్దీవుల బ్యూటీని తలపిం చింది.
కార్టు చుట్టూ డిజైన్ మధ్యలో పచ్చని కొబ్బరి చెట్లు.. బీచ్ వాతావరణం...నీలి సముద్రం డిజైన్ తో కార్డు కనిపిస్తుంది. కార్డు చూడగానే మాల్దీవుల లొకేషన్ గుర్తొచ్చిందంటే అతిశయోక్తి కాదు. రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల వెకేషన్ కి ఎన్నోసార్లు వెళ్లింది. జాకీతో లవ్ లో పడిన తర్వాత ప్రియుడితో ఆ స్పాట్ కి చెక్కేసిన సందర్భాలెన్నో. ఇప్పుడు వెడ్డింగ్ కార్డుపై అదే లొకేషన్ హైలైట్ అవ్వడం విశేషం. మరి యాదృశ్చికంగా జరిగిందా? రకుల్ అభిరుచి మేరకు డిజైన్ చేసారా? అన్నది సస్పెన్స్.