వర‌ద‌ బాధితులకు 'గేమ్ ఛేంజ‌ర్' కోటి విరాళం

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల్సిన స‌మ‌యం ఇద‌ని పేర్కొన్నారు.

Update: 2024-09-04 12:07 GMT

మెగా ఫ్యామిలీ నుంచి విరాళాల వెల్లువ కొన‌సాగుతోంది. తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌ర‌ద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల‌కు భారీ విరాళాన్ని ప్ర‌క‌టించారు. తెలంగాణ‌కు రూ.50ల‌క్ష‌లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రూ.50ల‌క్ష‌లు చొప్పున మొత్తం కోటి రూపాయ‌ల‌ను విరాళంగా అంద‌జేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల్సిన స‌మ‌యం ఇద‌ని పేర్కొన్నారు.

`వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నాను. ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను` అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. దీంతో మెగా ఫ్యామిలీ నుంచి భారీ ఎత్తున విరాళాలు సీఎం రిలీఫ్ పండ్ లో జ‌మ అవుతున్నాయి. ఇప్ప‌టికే చిరంజీవి కోటి విరాళం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు రాష్ట్రాల‌కు రెండు కోట్లు ప్ర‌క‌టించ‌గా, మ‌ళ్లీ ఏపీ మున‌క పంచాయ‌తీల‌కు నాలుగు కోట్లు అద‌నంగా విరాళం అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. దీంతో మెగా ఫ్యామిలీ నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి.

ఇంకా చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి విరాళాలు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే స్పందించాల్సిన చాలా మంది త‌మ దాతృహృద‌యాన్ని చాటుకున్నారు. అక్కినేని ఫ్యామిలీ స‌హా చాలా మంది హీరోలు ఈరోజు విరాళాలు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News