చరణ్ - శంకర్ రెమ్యునరేషన్స్.. తగ్గక తప్పలేదు!

అయితే ‘గేమ్ చేంజర్’ మూవీ కోసం కేవలం 60 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే చరణ్ తీసుకున్నారని సమాచారం. అలాగే శంకర్ 35 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Update: 2025-01-02 15:30 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూడేళ్ళ క్రితం ‘ఆర్ఆర్ఆర్’ తో ప్రేక్షకుల ముందుకొచ్చి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్నారు. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా రామ్ చరణ్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ మూవీలో నటించారు. ఇది చిరంజీవి చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ అయ్యింది.

దీంతో మెగా ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీతో సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10న పాన్ ఇండియా రేంజ్ నాలుగు భాషలలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా పైన మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. మూవీ పైన టాలీవుడ్ లో కంటే తమిళ్ మీడియా సర్కిల్ లో ఎక్కువ చర్చ నడుస్తోంది.

శంకర్ ఈ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవుతారని అందరూ భావిస్తున్నారు. దిల్ రాజు కూడా మూవీ పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే డల్లాస్ లో మెగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇక రాజమండ్రిలో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 4న జరగబోతోంది.

పవన్ కళ్యాణ్ దీనికి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాని శంకర్ మూడేళ్ళ నుంచి చేస్టున్నారు. అందుకే ప్రొడక్షన్ ఖర్చు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఈ సినిమా కోసం చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారంట. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పెరిగింది. 100 కోట్ల పైగా రెమ్యునరేషన్ ని అతనికి ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

అయితే ‘గేమ్ చేంజర్’ మూవీ కోసం కేవలం 60 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే చరణ్ తీసుకున్నారని సమాచారం. అలాగే శంకర్ 35 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ పెరగడంతో వీరిద్దరూ తమ రెమ్యునరేషన్ లో కొంత త్యాగం చేసారంట. ఇండస్ట్రీ వర్గాలలో ఈ టాక్ ప్రస్తుతం నడుస్తోంది. ‘గేమ్ చేంజర్’ తో సంక్రాంతి రేసులో బ్లాక్ బస్టర్ కొట్టాలనే టార్గెట్ తో మేకర్స్ ఉన్నారు.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ని మరింత స్పీడ్ పెంచారు. త్వరలో ముంబైలో కూడా మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. 2025లో టాలీవుడ్ నుంచి వస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో నేషనల్ మీడియా సైతం ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి సారించింది. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందా అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో ఉన్నారు.

Tags:    

Similar News