రాజమండ్రికి రామ్ షిప్టింగ్!
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు కనీస ప్రభావాన్ని కూడా చూపించలేకపోయాయి.
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి సరైన సక్సెస్ పడలేదు. చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు కనీస ప్రభావాన్ని కూడా చూపించలేకపోయాయి. వరుసగా నాలుగు సినిమాలు నిరుత్సాహ పరిచాయి. దీంతో రామ్ కి సక్సెస్ కీలకంగా మారింది. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు. పితో ఓ సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా నెమ్మదిగా జరుగుతోంది.
ఇటీవలే హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈనేపథ్యంలో కొత్త షెడ్యూల్ రాజమండ్రి లో ప్లాన్ చేసారు. రామ్ సహా యూనిట్ త్వరలోనే రాజమండ్రికి ప్రయాణం కానుంది. ఇది లాంగ్ షెడ్యూల్. దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ రాజమండ్రిలోనే గ్యాప్ లేకుండా చేస్తారుట. రాజమండ్రితో పాటు పరిసర గోదారి అందాలు..గ్రామాల్లో షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రామ్ సినిమా షూటింగ్ లు రాజమండ్రిలో జరగడం కొత్తేం కాదు.
ఆయన హీరోగా నటించిన చాలా సినిమాలు రాజమండ్రి అందాల్లో షూటింగ్ చేసారు. అయితే నెల రోజుల పాటు లాంగ్ షెడ్యూల్ షూటింగ్ చేయడం అన్నది ఇదే తొలిసారి. అలాగే సినిమాలో మరో స్టార్ కూడా భాగమవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ పేరున్న నటుడిని ఎంపిక చేయాలని మేకర్స్ భావి స్తున్నారుట. ఈ నేపథ్యంలో ఆ మూడు భాషల స్టార్ హీరోల పేర్లను పరిశీలిస్తున్నారుట. ఈ అంశంపై అతి త్వరలోనే స్పష్టత వస్తుందని తెలుస్తోంది.
సినిమాలో ఆ హీరో పాత్ర చాలా బలంగా ఉంటుందని...నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందని లీకులందు తున్నాయి. ఈనేపథ్యంలో ఏ హీరో ఎంపికైనా పారితోషికంగా కూడా భారీగానే చెల్లించే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ కాబట్టి ఆ విషయంలో ఎక్కడా రాజీ పడే పరిస్థితి ఉండదు. ఇందులో రామ్ కి జోడీగా భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తోంది.