రామ్ చరణ్.. బీస్ట్ మోడ్ ఆన్..

బుచ్చిబాబు RC16 కోసం ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా అంశాలతో కథ రాసారని టాక్.

Update: 2024-09-16 13:26 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తన తదుపరి సినిమా RC16 కోసం సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టును కిలారు వెంకట సతీష్ నిర్మించనుండగా, సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణంలో భాగమవుతోంది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రాక ముందు నుంచే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.


బుచ్చిబాబు RC16 కోసం ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా అంశాలతో కథ రాసారని టాక్. రామ్ చరణ్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే మేకోవర్ కోసం సన్నాహాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ తన పాత్ర కోసం నేటివిటీ టచ్ ఉన్న మాండలికంలో మాట్లాడతారని సమాచారం. ఇది చరణ్ నటనకు మరో సవాల్‌గా ఉండబోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

RC16 కోసం చరణ్ శారీరకంగా మార్పు కోసం కసరత్తులు మొదలుపెట్టారు. ప్రత్యేకమైన ఫిజికల్ ఫిట్నెస్ తో మేకోవర్ అవ్వాల్సి ఉంది. రామ్ చరణ్ తన ఫిట్నెస్ కోచ్ శివోహంతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. ఇందులో ఆయన కొత్త లుక్ కోసం చేసిన హార్డ్ వర్క్ స్పష్టంగా కనిపిస్తోంది. "బీస్ట్ మోడ్ ఆన్" అని చరణ్ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. సినిమా ప్రారంభానికి ముందే ఈ లుక్ పై చర్చలు మొదలయ్యాయి, ఇది అభిమానుల్లో మరింత అంచనాలను పెంచుతోంది.

ఇక సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏ.ఆర్. రెహమాన్ చాలా కాలం అనంతరం ఈ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే మూడు పాటలను కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది. సినిమాలో రెహమాన్ నుంచి వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మరో హైలైట్ కానుందనే చర్చ మొదలైంది. ప్రత్యేకంగా, ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో ఉత్తమమైన సినిమా అవుతుందనే టాక్ పరిశ్రమలో ఉంది.

అంతేకాకుండా, బుచ్చిబాబు సానా దర్శకత్వం, కథాపరంగా ఆయన రాసిన డైలాగ్స్ ఈ సినిమాను మరింత స్పెషల్‌గా మార్చనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చరణ్ ఇందులో పంచ్ డైలాగ్స్ తో పాటు కొంత కామెడీ టైమింగ్ కూడా చూపించబోతున్నారని సమాచారం. మొత్తానికి, RC16 చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లో మరో కీలక ఘట్టంగా నిలవనుందని ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News