గేమ్ ఛేంజర్.. ఇప్పటికైనా మేల్కొంటే బెటర్..

తాజాగా రామ్ చరణ్.. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల శంకర్ కూడా చరణ్ ది కేవలం 10 రోజుల షూట్ మాత్రమే ఉందని చెప్పారు.

Update: 2024-07-07 05:03 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది ఈ చిత్రం. ఆర్ఆర్ఆర్ తర్వాత హీరోగా రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో సినీ ప్రియులతో పాటు మెగా ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో మూవీని భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ మూడేళ్ల క్రితం మొదలైంది. మధ్యలో అనేకసార్లు బ్రేకులు పడ్డాయి. దీంతో ఇంకా చిత్రీకరణ పూర్తవ్వలేదు. డైరెక్టర్ శంకర్.. భారతీయుడు 2 సినిమాపై ఫోకస్ చేయడంతో గేమ్ ఛేంజర్ లేట్ అయింది. ఇటీవల మళ్లీ స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. 2024లో ఎలా అయినా గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

తాజాగా రామ్ చరణ్.. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల శంకర్ కూడా చరణ్ ది కేవలం 10 రోజుల షూట్ మాత్రమే ఉందని చెప్పారు. కాబట్టి చరణ్ షూటింగ్ పార్ట్ పూర్తవడం నిజమేనని తెలుస్తోంది. అయితే 2021 సెప్టెంబర్ 8వ తేదీన గేమ్ ఛేంజర్ సెట్స్ లోకి అడుగుపెట్టారు చరణ్. అలా సుమారు మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం టైమ్ ను కేటాయించారు చెర్రీ. ఇప్పుడు ఎట్టకేలకు పూర్తి చేసుకున్నారు.

ఇది మెగా ఫ్యాన్స్ కు హ్యాపీ న్యూస్ అయినా.. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు సాలిడ్ అప్డేట్ రాకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మూవీ నుంచి జరగండి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. మిక్స్ డ్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. ఒక్క టీజర్, గ్లింప్స్ కూడా విడుదల చేయలేదు. దీంతో ఇప్పటికైనా మంచి అప్డేట్ వచ్చి మూవీ రిలీజ్ డేట్ ప్రకటించాలని మేకర్స్ ను కోరుతున్నారు. త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చెబుతున్నారు.

అయితే అది నిజమనే చెప్పాలి. సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు ఉన్నా.. బజ్ మాత్రం క్రియేట్ అవ్వలేదు. ఇప్పటికే విడుదలైన ఆ ఒక్క సాంగ్ కూడా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపట్టాలి. వరుస అప్డేట్స్ ఇస్తూ ఆడియన్స్ దృష్టిని తమ సినిమా వైపు తిప్పుకోవాలి. గ్లింప్స్, ప్రోమోస్ తో సందడి చేయాలి. అలా సినిమాపై బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News