RC 16 స్పెషల్ రోల్.. ఆ సూపర్ స్టార్ ఏమన్నారంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన 16వ సినిమాను బుచ్చిబాబు దర్శకత్వంలో స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే

Update: 2024-03-20 11:04 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన 16వ సినిమాను బుచ్చిబాబు దర్శకత్వంలో స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఎంతో కాలంగా వేచి చూస్తున్నా అభిమానులకి చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఈరోజు గ్రాండ్గా సినిమాను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ లంచ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవితో పాటు స్టార్ డైరెక్టర్ శంకర్ అలాగే సుకుమార్ కూడా ప్రత్యేక అతిధులుగా పాల్గొన్నారు.

ఇక సినిమాలో వర్క్ చేసే టీమ్ సభ్యులు కూడా వేడుకకు హాజరయ్యారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో చరణ్ కు జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె గ్లామరస్ లుక్స్ తో వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాలు చాలా కాలంగానే వైరల్ అవుతున్నాయి. ప్రముఖ కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా ఇదివరకే క్లారిటీ వచ్చేసింది.

అయితే మరోసారి ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా తన పాత్ర గురించి కూడా షేర్ చేసుకున్నారు. రామ్ చరణ్ 16వ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను అంటూ దర్శకుడు బుచ్చిబాబు ఆ పాత్రను ఎలా ఉహించి డిజైన్ చేశాడు అనేది ఆలోచిస్తేనే మైండ్ బ్లాక్ అవుతుంది అని, ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో అన్ని భిన్నమైన లేయర్స్ ఉన్నట్లు శివరాజ్ కుమార్ వివరణ ఇచ్చారు.

అంతేకాకుండా రామ్ చరణ్ మంచి నటుడు అంటూ అతనితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అని తప్పకుండా సినిమా సరికొత్తగా ఉంటుంది అని వివరణ ఇచ్చారు. ఇక దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాలో మరి కొంతమంది స్టార్ నటీనటులను కూడా ప్రత్యేకమైన పాత్రలలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అందులో బాలీవుడ్ మలయాళం ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ కూడా ఉంటారని సమాచారం.

మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇక సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లోపు పనులన్నీ ఫినిష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక సినిమాను 2025 సమ్మర్ తరువాత ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతో దర్శకుడు బుచ్చిబాబు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News