2 పార్ట్స్ ట్రెండులో చరణ్ కూడానా?

అందుకే దీనిని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఆలోచనలో బుచ్చిబాబు ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Update: 2023-10-10 14:44 GMT

'ఉప్పెన' ఫేమ్​ డైరెక్టర్​ బుచ్చిబాబు - మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్​ కాంబోలో ఆర్సీ 16 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్​ చేసినప్పటికీ కనీసం ఇంకా సెట్స్​పైకి వెళ్లలేదు. స్కిప్ట్​ వర్క్​ ఆలస్యం కావడం సహా రామ్ చరణ్ గేమ్​ ఛేంజర్​తో బిజీ ఉండటం వల్ల షూటింగ్ ప్రారంభం కాలేదు. అయితే తాజాగా ఈ సినిమా కూడా ప్రస్తుతం ఫిల్మ్​ ఇండస్ట్రీలో నడుస్తున్న ఓ కొత్త ట్రెండ్​లో భాగంకానుందని తెలిసింది.

వివరాళ్లోకి వెళితే.. బాహుబలి, కేజీయఫ్​ సిరీస్‌ చిత్రాలకు దక్కిన ఆదరణతో.. కథలు చెప్పడంలో కొత్త మార్పుల వచ్చాయి. రెండు భాగాల ట్రెండ్‌ ఊపందుకుంది. నిర్ణీత నిడివిలో చెప్పలేమనుకున్న ఆసక్తికర కథలన్నింటినీ... భాగాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇది లాభదాయకంగా కూడా ఉండటంతో.. ఈ ఫార్ములాకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది.

రీసెంట్​గా ఎన్టీఆర్​ దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రకటించారు. ఇప్పుడు ఆర్​సీ 16 కూడా ఆ బాటలోనే నడవనుందట. ఈ మధ్యే ఈ సినిమా స్క్రిప్ట్​ వర్క్​ పూర్తైందని తెలిసింది. అయితే ఈ కథ కూడా చాలా పెద్దగా వచ్చిందట. అందుకే దీనిని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఆలోచనలో బుచ్చిబాబు ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఒకవేళ ఈ వార్త కనుక నిజం అయితే మెగా అభిమానులకు పండగనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా రెగ్యులర్​ షూటింగ్​.. గేమ్​ ఛేంజర్ పూర్తి అయ్యాకే ప్రారంభం అవుతుందని ప్రచారం సాగింది. కానీ వాటిని బుచ్చిబాబు కొట్టి పారేశారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభిస్తారని ఆ మధ్య క్లారిటీ ఇచ్చారు.

సినిమా రా అండ్‌ రస్టిక్‌గా ఉంటుందని బుచ్చిబాబు అన్నారు. సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నట్లు తెలిపారు. అందరూ ఈ చిత్రాన్ని స్పోర్ట్స్‌ డ్రామా అనుకుంటున్నారని.. కానీ ఇది వాళ్లందరి అంచనాలకు మించి ఉంటుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News