రాంగోపాల్ వర్మ పాన్ ఇండియా సినిమా!
తాజాగా ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో త్వరలో భారీ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.
సంచలనాల రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాదం లేనిదే వర్మ లేడు అన్నట్లు ఆయన వ్యాఖ్యలు నిత్యం మీడియాలో హైలైట్ అవుతుంటాయి. కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వివిధ ఇంటర్వ్యూలతో ఎక్కువగా వైరల్ అవుతున్నారు. తాజాగా ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో త్వరలో భారీ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పుడీ ప్రకటనపై ఆసక్తి సంతరించుకుంది.
రెండేళ్ల గ్యాప్ అనంతరం వర్మ గత ఏడాది 'వ్యూహం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదీ మార్చిలో రిలీజ్ అయింది. ఆ తర్వాత మళ్లీ కొత్త సినిమా అప్ డేట్ లేదు. వివిధ ప్రాజెక్ట్ లు చేస్తున్నట్లు ప్రకటించారు గానీ వాటిని పట్టాలెక్కించలేదు. వాటి స్టోరీలు ఎంత వరకూ వచ్చాయి? అన్నది కూడా అప్ డేట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా భారీ సినిమా చేస్తానంటూ ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులంతా పాన్ ఇండియా సినిమాలు తీస్తోన్న సంగతి తెలిసిందే. 1000 కోట్టు..1500 కోట్టు.. .2000 కోట్లు అంటూ ఇండియాను షేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మ నోటి నుంచి భారీ సినిమా ప్రకటన రావడం అభిమానులు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఆ సినిమా కథ ఏంటి? అన్నది త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. డైరెక్టర్ గా వర్మ ఎప్పుడో ఇండియాని షేక్ చేసే సినిమాలు తీసారు.
మరి భారీ సినిమా ప్రకటన వెనుక ఆయన వ్యూహం ఏంటి? అన్నది తెలియాలి. అలాగే వర్మ ఒకానొక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నట్లు వెల్లడించారు. మరి ఆయనకు అలాంటి ఆలోచన ఏ కష్టం కారణంగా వచ్చిందో తెలియాలి.