సీక్వెల్లో బూతులు తగ్గించారట!
ఆ విషయమై రానా తాజాగా మాట్లాడుతూ రానా నాయుడు విమర్శలపై స్పందించాడు. బూతుల విషయంలో స్పష్టత ఇవ్వడం జరిగింది.
రానా హోస్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో టాక్ షో రాబోతుంది. 'ది రానా దగ్గుబాటి షో' అనే పేరుతో రాబోతున్న ఈ టాక్ షో ప్రమోషన్స్‌లో భాగంగా రానా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. రానా వరుసగా సినిమాలు చేయక పోవడానికి కారణం మంచి కథలు రాకపోవడం అంటూ చెప్పుకొచ్చాడు. లీడర్, నేనే రాజు నేనే మంత్రి వంటి మంచి కథలతో వస్తే తప్పకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాను అంటూ ప్రకటించాడు. అంతే కాకుండా తన నుంచి సినిమాలు, సిరీస్‌లు, ఇలాంటి షోలు రెగ్యులర్‌గా వస్తాయని, తాను అన్ని విధాలుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాను అన్నాడు.
రానా నాయుడు వెబ్ సిరీస్ తో రానా ఓటీటీ వెబ్ సిరీస్‌లో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. బాబాయి వెంకటేష్ తో కలిసి రానా ఆ వెబ్ సిరీస్‌లో నటించాడు. నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన రానా నాయుడు వెబ్ సిరీస్ ను ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా లేదు. ఫ్యామిలీ అంతా కలిసి వెంకటేష్, రానా సిరీస్ చూడాలని కోరుకుంటే అందులో మరీ దారుణంగా బూతులు ఉన్నాయి అంటూ విమర్శలు వచ్చాయి. ఆ విషయమై రానా తాజాగా మాట్లాడుతూ రానా నాయుడు విమర్శలపై స్పందించాడు. బూతుల విషయంలో స్పష్టత ఇవ్వడం జరిగింది.
వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కి ముందే తాము బూతులు ఉంటాయి, ఫ్యామిలీతో కలిసి చూసేది కాదు అంటూ ప్రకటించాం. కానీ కొందరు యూత్ ఫ్యామిలీతో కలిసి చూసి ఇబ్బంది పడ్డారు. దానికి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతం రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్ 2 కొనసాగుతోంది. ఇప్పటికే షూటింగ్‌ను ముగించాం. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను ముగించి స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాని స్ట్రీమింగ్ తేదీ పై తన వద్ద ఎలాంటి సమాచారం లేదు అన్నట్లుగా రానా స్పందించారు. సీజన్ పై గురించి మాట్లాడుతూ మరింత ఆకర్షణీయంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మొదటి సీజన్లో మాదిరిగా కచ్చితంగా బూతులు ఉండవు అని, సీజన్ 2 లో కాస్త బూతులు తగ్గించామని రానా ప్రకటించారు. రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్ 2 ను ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉంటుంది అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి సినిమాలు ఏమీ చేయడం లేదని, మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు. త్వరలోనే సినిమాను ప్రారంభిస్తాం అంటూ ప్రకటించాడు. కథ విషయంలో ఫైనల్ కావాల్సి ఉందని పేర్కొన్నాడు. ది రానా దగ్గుబాటి షో తో సరికొత్త టాక్ షో ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా రానా పేర్కొన్నాడు. రానా ఈ వెబ్ సిరీస్‌ను సొంతంగా నిర్మించారు.