ఎంతైనా రానా తోపు.. కిర్రాక్ మైండ్
రానా.. ఆయన రూటే సెపరేటు. దీని గురించి ఏ సినీ ప్రేమికుడిని అడిగిన చెబుతారు. అలాగే ఆయన్ను దగ్గరుండి చూసిన వాళ్లు కూడా అంటుంటారు. ఎందుకంటే ఆయన సినీ జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకమైనది.
రానా.. ఆయన రూటే సెపరేటు. దీని గురించి ఏ సినీ ప్రేమికుడిని అడిగిన చెబుతారు. అలాగే ఆయన్ను దగ్గరుండి చూసిన వాళ్లు కూడా అంటుంటారు. ఎందుకంటే ఆయన సినీ జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకమైనది. హీరో, విలన్.. అని తేడా లేదు... నటనకు ప్రాముఖ్యత, కథకు బలముండే పాత్రైతే చాటులు.. పాత్రేదైనా, ఘట్టమేదైనా ఫట్ ఫట్‌లాడించేస్తారు. భళ్లాలదేవుడిగా 'బాహుబలి'ని బలంగా ఢీ కొట్టాలన్నా.. రాధా జోగేంద్రగా భార్యను పిచ్చిపిచ్చిగా ప్రేమించాలన్నా.. తుపాకీ చేతపట్టి అన్యాయాన్ని ఎదురించాలన్నా.. ఆయనకు ఆయనే సాటి.
సినీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా ఇతర హీరోల్లా ఒకే ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోలేదు. ఎప్పటికప్పుడు వైవిధ్యత చూపిస్తూ కెరీర్లో ముందుకెళ్తున్నారు. అలానే సినిమా వేడుకలైనా, ఇంకా ఎలాంటి కార్యక్రమాలైనా.. ఆయన మాట్లాడే విధానం, హోస్టింగ్ చేసే తీరు అందరినీ మెప్పిస్తుంటుంది. అందుకే ఇప్పుడాయన ఇండియన్ సినిమాను ప్రపంచ వేదికపై కూడా రిప్రెజెంట్ చేయగలిగే స్థాయికి ఎదిగారు.
తాజాగా 'ప్రాజెక్ట్ కె' టైటిల్ గ్లింప్స్ కోసం అమెరికా శాన్ డీగో ప్రఖ్యాత 'కామిక్ కాన్' ఈవెంట్లోనూ అదరగొట్టేశారు. వాస్తవానికి ఈ ఈవెంట్‌కు 'ప్రాజెక్ట్ కె' టీమ్ మొత్తం అక్కడికి వెళ్లింది. దర్శకుడు నాగ్ అశ్విన్, చిత్ర నిర్మాత అశ్వినీ దత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, ప్రభాస్ అందరూ వెళ్లారు. కానీ ఈ చిత్రంతో ఎటువంటి సంబంధం లేకపోయినా.. 'ప్రాజెక్ట్ కె' టీమ్ రానాను అక్కడికి తీసుకెళ్లింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. వేదికలపై రానా ఎంతటి ప్రభావం చూపగలరో.
మరోవైపు రానా.. తన చిత్రాలను ప్రకటించేందుకు అక్కడికి వెళ్లడమూ ఓ కారణం. కానీ ఈ సినిమా అనౌన్స్మెంట్ విషయాన్ని పక్కనపెడితే.. ఈ కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్‌తో పాటు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది రానానే. ఇంకా చెప్పాలంటే ప్రభాస్ కన్నా కాస్త ఎక్కువగానే తన మాటలతో ఆకట్టుకున్నారు రానా. వేదికపై తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇండియన్ సినిమా రెప్రజెంటేషన్ మంచిగా ఇచ్చారు. మొత్తం లీడ్ తీసుకుని ప్రాజెక్ట్ కె తరఫున కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. హాలీవుడ్ ప్రముఖుల, ప్రపంచమంతా చూసే ఇలాంటి ఓ కార్యక్రమానికి మన తరఫున హోస్ట్ చేయడం అంటే సాధారణ విషయం కాదనే చెప్పాలి. ఎందుకంటే ఏ మాత్రం కాస్త తేడా వచ్చినా.. అది ఎన్ని విమర్శలకు గురి చేస్తుందో తెలిసిందే.
కానీ రానా మాత్రం అస్సలు తడబడకుండా తనదైన స్ట్లైల్లో ప్రాజెక్ట్ కెతో పాటు భారతీయ సంస్కృతి, ఇండియన్ సినిమాల విశిష్టతను బాగా చెప్పారు. ఆయన ప్రెజెంట్ చేసిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. అలాగే మిగతా 'ప్రాజెక్ట్ కె' టీమ్ కూడా బాగానే రెప్రజెంటేషన్ ఇచ్చింది. అయితే ఈ విషయంలో ఎక్కువ భాగం క్రెడిట్ అంతా రానాకే ఇస్తున్నారు సినీ అభిమానులు.