ఫోటోగ్రాఫర్‌లపై స్టార్ హీరో ఆగ్రహం
అలాంటి సమయంలో ఎదుటివారు మీడియాపై సంయమనం కోల్పోవడానికి ఆస్కారం ఉంది.
ఫోటోగ్రాఫర్ల అత్యుత్సాహం ఒక్కోసారి సెలబ్రిటీల్లో ఆగ్రహానికి కారణమవుతుంది. పబ్లిక్ ఫంక్షన్లలో ఒకరితో ఒకరు పోటీపడుతూ సెలబ్రిటీలకు ఊపిరాడనివ్వకుండా స్నాప్‌లతో విరుచుకుపడుతుంటారు. అలాంటి సమయంలో ఎదుటివారు మీడియాపై సంయమనం కోల్పోవడానికి ఆస్కారం ఉంది. ఇటీవల దసరా సందర్భంగా దుర్గమ్మ పూజా సమయంలో కాజోల్ కొందరు మీడియా వ్యక్తులపై సీరియస్ అయ్యారు. కొంత దురుసుగా ప్రవర్తించడం తెలిసినదే.
ఇప్పుడు రణబీర్ కపూర్ వంతు. రణబీర్ తన భార్య సహా ఇతర కుటుంబ సభ్యులతో తన అత్తగారైన సోనీ రజ్దాన్ బర్త్ డే వేడుకల కోసం వెళ్లారు. రణబీర్ కపూర్, అలియా భట్, నీతూ కపూర్, మహేష్ భట్, పూజా భట్ , షాహీన్ భట్ ఈ పుట్టినరోజును సెలబ్రేట్ చేసారు. వీరంతా సోనీ పుట్టినరోజును ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో జరుపుకున్నారు. పూజా భట్ - షాహీన్ భట్ కూడా పార్టీలో చేరారు. ఇంతలోనే పార్టీ ముగిశాక రణబీర్ కపూర్ - అలియా భట్ రెస్టారెంట్ నుండి బయటకు వస్తున్నట్లు కనిపించింది. అదే సమయంలో రణబీర్ మామగారైన మహేష్ భట్‌పై ప్రేమను కురిపించాడు రెస్టారెంట్ నుండి బయటకు వచ్చే ముందు తన మామ తలపై ముద్దు పెట్టాడు. వారు కొద్దిసేపు మాట్లాడి, ఛాయాచిత్రకారులకు పోజులివ్వగా, మహేష్ భట్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన కుటుంబ సభ్యులు కెమెరాలకు పోజులివ్వడం కనిపించింది.
తాజాగా వైరల్ భయానీ షేర్ చేసిన ఓ పోస్ట్‌లో రణబీర్ కొందరిపై దేనికోసమో కోపంతో ఎగిరిపడుతున్నాడు. ఫోటోగ్రాఫర్ల దురుసు ప్రవర్తనతో అతడు కొంత సీరియస్ అయినట్టు కనిపిస్తోంది. తమ కారు వైపు నడుచుకుంటూ వెళుతుండగా వెంబడించిన ఫోటోగ్రాఫర్లపై ఎందుకనో ఈ జంట కోపంగా ఉన్నారు. భార్య ఆలియాకు అసౌకర్యం కలిగిస్తున్న వారిపై అతడు ఏం చేస్తున్నారయా? అంటూ సీరియస్ అయ్యాడు.