భార్యభర్తలిద్దరూ కలవడానికి టైమే దొరకదా?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్నిసార్లు తను ఏ అర్దరాత్రి వస్తాడో తనకే తెలియదు.
బాలీవుడ్ జోడీ రణవీర్ సింగ్- దీపికా పదుకొణే ధాంపత్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. వివాహ మైన దగ్గర నుంచి దంపతులు ఇద్దరు మరింత ఉత్సాంగా పనిచేస్తున్నారు. కొత్త బాధ్యతలు కూడా తోడ య్యాయి. వాళ్లతో పాటు పుట్టే పిల్లల భవిష్యత్ ని కూడా దృష్టి లో పెట్టుకోవాలి కాబట్టి సంపాదన కూడా అంతకంతకు పెరగాల్సిన అవసరం ఉంది. మరోవైపు మార్కెట్ లో పోటీని తట్టుకుని నిలబడాలి.
నటుల న్నాక ఇవన్నీ చేయక తప్పదు. ఇంట్లో ఖాళీగా కూర్చునేది చాలా తక్కువ సమయమే ఉంటుంది. అందులోనూ రణవీర్ సింగ్-దీపికా పదుకొణే అయితే అస్సలు ఖాళీ ఉండదంటున్నారు. బాలీవుడ్ లో వీళ్లంత బిజీగా ఉన్నారో తెలిసిందే. ఇద్దరు ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నారు. ఓవైపు సినిమాలు ..మరోవైపు బ్రాండింగ్స్ ఇలా రేయింబవళ్లు ఖాళీ లేకుండా గడుపుతుంటారు. వీళ్లద్దరు ఇంట్లో కలుసుకోవడం కూడా చాలా తక్కువని తెలుస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్నిసార్లు తను ఏ అర్దరాత్రి వస్తాడో తనకే తెలియదు. ఆయన వచ్చే సమయానికి నేను నిద్రలో ఉంటాను . మళ్లీ వెకుమ జామున లేచి నేను పరుగులు పెట్టాలి( షూటింగ్ కి వెళ్లాలి కాబట్టి). అందుకే కలవాడానికి కూడా మేము షెడ్యూల్ వేసుకుంటాం. ఏ సమయంలో కలిసి మాట్లాడుకోవాలి? ఎప్పుడు బయటకు వెళ్లాలి? ఎంతసేపు మాట్లాడుకోవాలి? ఇలా ప్రతీ దానికి ఓ ప్లానింగ్..షెడ్యూల్ ఉంటుంది.
ఆషెడ్యూల్ తూచ తప్పకుండా క్రమం తప్పకుండా ఫాలో అవుతాం. అలా వేసుకున్నాం కాబట్టే కలవగల్గు తున్నాం. లేకపోతే బిజీ లైఫ్ లో మరింత ఒత్తిడికి గురయ్యే వాళ్లం. రణవీర్ తో ఎక్కువ సేపు గడపాలని నాకెప్పుడు అనిపిస్తుంది. ఆయన నాపట్ల అలాగే పీలవుతాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఎలాంటి క్లాషెస్ రాకుండా చూసుకుంటాం. అది ఇద్దరి బాధ్యత కూడా' అంది.