నేషనల్ క్రష్ కోసం నేచురల్ స్టార్ ప్రయత్నాలా!
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో `ది ప్యారడైజ్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో `ది ప్యారడైజ్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులోని నానికి జోడీగా హీరోయిన్ ఎంపిక కాలేదు. శ్రద్దా కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు తెరపైకి వచ్చాయి గానీ ఎవరూ ఫైనల్ ఆలేదు. శ్రద్దా కపూర్ భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో మేకర్స్ లైట్ తీసుకున్నారు. మృణాల్ ఠాకూర్ విషయంలో మేకర్స్ అంత ఆసక్తిగానూ లేరు.
ఇప్పటికే `హాయ్ నాన్న`లో నటించింది. మళ్లీ అదే హీరోయిన్ అయితే ప్రేక్షకులకు ప్రెష్ ఫీలింగ్ రాదు? అన్న కోణంలో వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రేసులోకి నేషనల్ క్రష్ రష్మికా మందన్నా పేరు కూడా వచ్చింది. నానికి జోడీగా రష్మిక అయితే పర్పెక్ట్ గా ఉంటుందని శ్రీకాంత్ భావిస్తున్నాడుట. తాను రాసిన పాత్రకు కూడా అమ్మడు పక్కాగా సూటవుతుందిట. దీంతో ఆమె డేట్ల కోసం నాని ప్రతయ్నాలు చేస్తున్నట్లు సమాచారం.
రష్మిక నటిగా చాలా బిజీగా ఉంది. తెలుగు, హిందీ సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టి పని చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా కమిట్ అవుతుందా? అన్న సందేహం ఉంది. అదుకే నేరుగా నాని నే ఆమెని రంగంలోకి దించడానికి దిగినట్లు తెలుస్తోంది. నాని అమ్మడిని కన్విన్స్ చేసినా? భారీ పారితోషికం డిమాండ్ చేస్తుంది. ఆమె పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే డిమాండ్ చేస్తుంది.
అయితే నిర్మాతలు కూడా రష్మిక అడిగినంత ఇవ్వాలనే ఆలోచనలోనే ఉన్నట్లు సమాచారం. రూపాయి ఎక్కువ అయిన రష్మిక బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వగలదు. తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉన్న నటి. రష్మిక ఇమేజ్ తో సినిమాకి బిజినెస్ పరంగానూ బాగా కలిసొస్తుంది. ప్రచారానికి రష్మిక నిర్మాతలకు అన్ని రకాలుగా సహ కరిస్తుంది. అదే శ్రద్దా కపూర్ ని తీసుకుంటే? ఇదంతా జరగడం కష్టమే.