ఫోటో స్టోరి: నేషనల్ క్రష్ ఇందుకే స్పెషల్
ఇటీవల అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో రష్మిక ప్రధాన ఆకర్షణగా మారింది.
తనదైన అందం, నటప్రతిభతో హృదయాలను గెలుచుకుంది రష్మిక మందన్న. పుష్పలో శ్రీవల్లిగా మనసులు గెలుచుకున్న ఈ కన్నడ బ్యూటీ, అటుపై యానిమల్ చిత్రంలో రణబీర్ భార్యగా ఠిపికల్ నటనతో మైమరిపించింది. నేషనల్ క్రష్ గా గౌరవించి హిందీ ఆడియెన్ సైతం తనను విపరీతంగా అభిమానిస్తున్నారు. సోషల్ మీడియాల్లో లక్షలాదిగా ఫాలోవర్లు ఏర్పడ్డారు.
ఇటీవల అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో రష్మిక ప్రధాన ఆకర్షణగా మారింది. ఈవెంట్ నుంచి రష్మిక ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇంతలోనే రష్మిక మందన్న స్పెషల్ లుక ఒకటి నెట్ లోకి వచ్చింది. నేవీ బ్లూ చీర కాంబినేషన్ రవికెలో రష్మిక ఎంతో ముగ్ధ మనోహరంగా కనిపించింది. ఈ ట్రెడిషనల్ లుక్ కి తగ్గట్టే కాంబినేషన్ బ్లూ ఆభరణాలు ఎంతో ఆకర్షణీయంగా కుదిరాయి. రష్మిక తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంది. తనదైన ఆత్మవిశ్వాసం ఆమె అందాన్ని ఆరాధించేలా టీజ్ చేస్తోంది.
తన తాజా ఫోటో షూట్‌లో రష్మిక స్లీవ్‌లెస్ బ్లౌజ్- చీర యూనిక్ గా ఆకర్షణీయంగా కనిపించాయి. డీప్ నెక్ బ్లౌజ్ రష్మికకు ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. అంబానీ పెళ్లి వేడుకల సమయంలో ఇలా ట్రెడిషనల్ గా కనిపించిన రష్మిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.
పుష్ప 1, యానిమల్ చిత్రాల తర్వాత రష్మిక దృష్టి 'పుష్ప 2'పైనే ఉంది. ఈ సినిమా 2024 మోస్ట్ అవైటెడ్ చిత్రంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు. మొదటి భాగంలో శ్రీవల్లిగా మెప్పించిన రష్మిక రెండో భాగంలోను అదే పాత్రలో కనిపించనుంది. మరోవైపు తెలుగు, హిందీలో వరుస చిత్రాలతో ఈ బ్యూటీ బిజీగా ఉంది.