ఆ భామని మరింత బోల్డ్ గా?
నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్నా పెర్మార్మెన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు దర్శకుల హీరోయిన్. దర్శకుల విజన్ కి తగ్గట్టు మౌల్డ్ అవుతుంది
నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్నా పెర్మార్మెన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు దర్శకుల హీరోయిన్. దర్శకుల విజన్ కి తగ్గట్టు మౌల్డ్ అవుతుంది. అందుకే 'పుష్ప' లో శ్రీవల్లి పాత్రలో అంత గొప్పగా అభినయించింది. డబుల్ మీనింగ్ డైలాగులతో యువతని ఆకర్షించింది. ఆ పాత్రతో పాన్ ఇండియానే షేక్ చేసింది. నిజంగా ఆమెలో అంత గొప్ప నటి ఉందని? రష్మికకి కూడా అప్పుడే తెలిసి ఉంటుంది.
అదంతా దర్శకుడి గొప్పతనం. దర్శకుడిలో మ్యాటర్ఉంటే? ఎలాంటి నటుల్ని అయినా గొప్ప నటులుగా తీర్చుదిద్దుతారు. తాజాగా యానిమల్ రూపంలో రష్మికకి అలాంటి గోల్డెన్ ఛాన్స్ దక్కింది అని చెప్పొచ్చు. ఈ సినిమాతో బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో రణబీర్ కపూర్ కి జోడీగా నటిస్తోంది. ఆయనకు భార్య పాత్ర లో మెప్పించనుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తోన్నీ ఈ సినిమా ప్రచార చిత్రాల్లో సినిమా కంటెంట్ ఎలాంటిందన్నది క్లారిటీ వస్తుంది.
షడ్రుచుల సమ్మేళనంగా కంటెంట్ కనిపిస్తుంది. వినోదం...రొమాన్స్..యాక్షన్ అన్ని సమపాళలో కనిపిస్తు న్నాయి. ఇక రష్మిక పాత్ర మరింత బోల్డ్ గానూ హైలట్ అవుతుందని ప్రచార చిత్రాలు చూస్తేనే తెలుస్తుంది. చీరకట్లులో రష్మికని ఎంత రొమాంటిక్ గా లాంచ్ చేసారో తెలిసిందే. రణబీర్ కపూర్ తో బెడ్ రూమ్ సన్నివేశాల్లోనూ రష్మిక చెలరేగినట్లు తెలుస్తోంది. లిప్ లాక్ లు...ఇంటిమేట్ సన్నివేశాల్లో రష్మిక ఏ మాత్రం తగ్గలేదని టాక్ బలంగా వినిపిస్తుంది.
ఈ నేపథ్యంలో ఆమె పాత్రకి సంబంధించి బాలీవుడ్ లో మరో సంచలన వార్త హల్చల్ చేస్తుంది. ఇందులో రష్మికని లో దుస్తుల్లోనూ హైలైట్ చేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. కొన్ని సన్నివేశాల డిమాండ్ తో పాటు..బాలీవుడ్ ని లాక్ చేయాలంటే? ఇలాంటి సన్నివేశాలు తప్పనిసరిగా భావించి దర్శకుడు రష్మికని ఆ యాంగిల్ లోనూ చూపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఓ నటిగా రష్మిక సైతం వాటికి ఎలాంటి అడ్డు చెప్పకుండా నటించిందని వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాలి.