వారం గ్యాప్‌లో ఆమె జాతకం తేలిపోనుంది!

టాలీవుడ్‌లో సుధీర్ బాబుతో కలిసి 'ఎస్‌ఎంఎస్‌' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రెజీనా కాసాండ్రా.;

Update: 2025-03-26 07:19 GMT
వారం గ్యాప్‌లో ఆమె జాతకం తేలిపోనుంది!

టాలీవుడ్‌లో సుధీర్ బాబుతో కలిసి 'ఎస్‌ఎంఎస్‌' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రెజీనా కాసాండ్రా. తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ్‌, కన్నడంలో ఎక్కువ సినిమాలు చేసిన ముద్దుగుమ్మగా నిలిచింది. రెజీనా టాలీవుడ్‌లో ఒకానొక సమయంలో యంగ్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా నిలిచింది. పలువురు టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరోలతో సినిమాల్లో నటించింది. కానీ స్టార్‌ హీరోలతో కలిసి నటించే అవకాశం ఈ అమ్మడికి దక్కలేదు. దాంతో స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్ సొంతం చేసుకోకుండానే టాలీవుడ్‌లో మీడియం రేంజ్‌ హీరోయిన్‌గా నిలిచింది. స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కకున్నా వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతుంది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు 20 ఏళ్లు అవుతుంది. రెజీనా రెండు మూడు హిందీ సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. సౌత్‌ సినిమాల్లో ఇప్పటికే ఒక స్థాయిలో గుర్తింపు ఉన్న ఈ అమ్మడు బాలీవుడ్‌లో మరోసారి గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తుంది. రెజీనా త్వరలో రెండు హిందీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ నటుడు సన్నీ డియోల్‌ నటించిన 'జాట్‌' సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఆ సినిమాలో రెజీనా కీలక పాత్రలో కనిపించబోతుంది. ఏప్రిల్‌ 24న జాట్‌ సినిమా బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రెజీనా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

జాట్‌ సినిమాతో పాటు రెజీనా హిందీలో మరో పెద్ద హీరోతో కలిసి నటించింది. సూపర్‌ హిట్‌ అయిన కేసరి సినిమా ప్రాంచైజీలో రాబోతున్న అక్షయ్‌ కుమార్‌ 'కేసరి చాప్టర్‌ 2' సినిమాలో రెజీనా నటించిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ రెజీనా పాత్రను సస్పెన్స్‌గా ఉంచుతున్నారని తెలుస్తోంది. స్వతంత్య్ర ఉద్యమ సమయంలో జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోత బాధితుల కోసం పోరాడిన న్యాయవాది, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సి శంకరన్ నాయర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సి శంకరన్ నాయర్ భార్య పాత్రలో రెజీనా కనిపించబోతుంది అనే వార్తలు వచ్చాయి. కేసరి 2 సినిమాను ఏప్రిల్‌ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరిగాయి.

ఈ రెండు సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్నాయి. ఐపీఎల్‌ నుంచి గట్టి పోటీ ఉన్న కారణంగా ఈ రెండు సినిమాలకు ఒక మోస్తరు బజ్ క్రియేట్‌ అయింది. అయితే సినిమాలు ఎంత మేరకు హిట్‌ అవుతాయి అనేది తెలియాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు వారం గ్యాప్‌లోనే రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్‌లో రెజీనా జాతకం ఏంటి అనేది ఆ వారం రోజుల్లోనే తేలిపోయే అవకాశం ఉంది. రెండు సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యి ఆమె పాత్రలకు ప్రాముఖ్యత ఉంటే బాలీవుడ్‌లో రాబోయే రోజుల్లో వరుస సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు తమిళ్‌లో నాలుగు అయిదు సినిమాల్లో నటిస్తోంది. ఒక మలయాళ సినిమాను కమిట్‌ అయింది. హీరోయిన్‌గానే కాకుండా పాత్రకు ప్రాముఖ్యత ఉన్న ప్రతి సినిమాకు రెజీనా గ్రీన్ సిగ్నల్‌ ఇస్తూ సినిమాలు చేస్తూ వెళ్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు రాబోయే రోజుల్లో ఈమె కెరీర్‌ను నిర్ణయించబోతున్నాయి.

Tags:    

Similar News