హీరోయిన్ రెండు మతాల పేరు వెనుక కథ ఇది
కానీ గత కొన్నాళ్లుగా ఈమె పెద్దగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనిపించడం లేదు.
సుధీర్ బాబు 'ఎస్ఎంఎస్' సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రెజీనా కసాండ్ర. ఈ అమ్మడు టాలీవుడ్లో ఒకానొక సమయంలో ఫుల్ బిజీగా సినిమాలు చేసింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదట్లో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేసినా ఆ తర్వాత యంగ్ హీరోలు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. ఆ సమయంలో మెగా హీరోలతో పాటు పలువురు యంగ్ హీరోలతో ఈమె చేసిన సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో మరిన్ని ఆఫర్లు ఈమెకు వచ్చాయి. కానీ గత కొన్నాళ్లుగా ఈమె పెద్దగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనిపించడం లేదు. అయితే తమిళ్, హిందీ సినిమాల్లో ఈమె నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
2012లో టాలీవుడ్లో అడుగు పెట్టిన ఈ అమ్మడు దాదాపు దశాబ్ద కాలం పాటు వరుసగా సినిమాలు చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ స్థాయిలో ఈ అమ్మడు సైతం టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంటుందని అంతా భావించారు. కానీ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. చేసిన సినిమాలు హిట్ అయినా స్టార్ హీరోల దృష్టి ఈ అమ్మడిపై పడలేదు. దాంతో ఈమెకు ఆశించిన స్థాయిలో స్టార్డం దక్కలేదు. తెలుగులో ఈమె మళ్లీ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పేరు వెనుక ఉన్న కథ గురించి చెప్పింది. రెండు మతాలకు సంబంధించిన తన పేరు వెనుక ఉన్న స్టోరీ గురించి చెప్పి అందరిని సర్ప్రైజ్ చేసింది.
రెజీనా మాట్లాడుతూ... మా అమ్మ, నాన్నలది ప్రేమ వివాహం. అమ్మ క్రిస్టియన్ కాగా నాన్న ముస్లీం. వారు పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మ ముస్లిం మతాన్ని స్వీకరించారు. నేను పుట్టిన తర్వాత నాకు ముస్లిం పేరు అయిన రెజీనా పెట్టారు. నాకు ఆరు ఏళ్ల వయసు ఉన్నప్పుడు అమ్మా నాన్న విడి పోయారు. దాంతో అమ్మ తిరిగి క్రిస్టియన్ మతాన్ని తీసుకుంది. అప్పుడు నా పేరుకు కసాండ్రను జోడించింది. అలా ముస్లీం మతం ప్రకారం రెజీనా కాగా, క్రిస్టియన్ పేరు కసాండ్ర నా పేరుకు కలిసింది. అలా నేను రెజీనా కసాండ్ర అయ్యాను అంటూ రెజీనా చెప్పుకొచ్చింది. తాను రెండు మతాలను గౌరవిస్తాను అంటూ రెజీన్ పేర్కొంది.
ప్రస్తుతం తమిళ్, హిందీలో కలిపి మూడు నాలుగు సినిమాలు చేస్తోంది. అందులో క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. హిందీ ప్రేక్షకులను మెప్పించేందుకు ఈమె చాలా ప్రయత్నాలు చేస్తుంది. త్వరలోనే వెబ్ సిరీస్ ద్వారా హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి నటన ప్రతిభ ఉన్న ఈ అమ్మడు టాలీవుడ్‌కి చాలా తొందరగా దూరం కావడం ఆమె ఫ్యాన్స్‌కి ఆవేదన కలిగిస్తుంది. మళ్లీ టాలీవుడ్లో రెజీనా ఎప్పుడు నటిస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మొత్తంలో రెజీనా నుంచి తెలుగు సినిమా ఒక్కటీ రాలేదు. మరి వచ్చే ఏడాది వస్తుందేమో చూడాలి.