GUN గురి పెట్టింది KTRకు.. షాట్ త‌గిలింది NAGకు: ఆర్జీవీ

కానీ ఆర్జీవీ మైండ్ గేమ్ ని ఇంటెలెక్చువల్ క్వాలిటీని ఎవ‌రూ అంత తేలిగ్గా తీసుకోరు.

Update: 2024-10-04 17:01 GMT

ఆర్జీవీపై ఆయాన్ ర్యాండ్ స‌హా ఎంద‌రో సంక్లిష్ఠ‌ మ‌న‌స్త‌త్వ శాస్త్ర‌వేత్త‌ల ప్ర‌భావం ఉంది. ఆ ప్ర‌భావంతో అత‌డు మాట్లాడే ప్ర‌తి మాటా సామాన్యుల‌కు తేడాగా వినిపిస్తుంది. ఆయ‌న పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎంతో గొప్ప‌ది అయినా ప్ర‌జ‌ల దృష్టిలో అతిగా క‌నిపిస్తుంది. కానీ ఆర్జీవీ మైండ్ గేమ్ ని ఇంటెలెక్చువల్ క్వాలిటీని ఎవ‌రూ అంత తేలిగ్గా తీసుకోరు. అత‌డు సైక‌లాజిక‌ల్ గేమ్ ఆడటంలో నిష్ణాతుడు. ఎదుటివారిని బ‌ట్టి ఛ‌మ‌క్కులు ఎలా విస‌రాలో తెలిసిన మేధావి.

అందుకే అత‌డు ఎలాంటి కామెంట్ చేసినా దానికి ఫాలోవ‌ర్స్ ఏర్ప‌డ్డారు. త‌న‌కంటూ ఒక వ‌ర్గం ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే, నిన్నటి రోజున స‌మంత‌- చై అక్కినేని బ్రేకప్ పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్ పై సెటైర్ వేసిన ఆర్జీవీ... ఆమె స‌మంత‌ను పొగిడింది! అని సోష‌ల్ మీడియాల్లో రాసారు. చాలామంది స‌మంత‌కు అవ‌మానం జ‌రిగింద‌ని క‌న్నీరు కారిస్తే అందుకు భిన్నంగా ఆర్జీవీ ఆలోచించారు. ఇలాంటిది కేవ‌లం ఆర్జీవీకి మాత్ర‌మే సాధ్యం అని మ‌రోసారి నిరూపించారు.

ఇప్పుడు మ‌రోసారి ఇదే ఇష్యూపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను ఎక్స్ ఖాతాలో జోడించారు ఆర్జీవీ. దాని సారాంశం ఇలా ఉంది. ``ఆమె (కొండా సురేఖ‌) GUN గురి పెట్టింది కేటీఆర్ బిఆర్ఎస్ పై.. కానీ షాట్ త‌గిలింది నాగార్జున - చై అక్కినేనికి... క్ష‌మాప‌ణ‌లు చెప్పింది స‌మంతకు .. !! ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కూడా ఈ సమీకరణాన్ని అర్థంచేసుకోగలడని నాకు సందేహం ఉంది!`` అంటూ త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు ఆర్జీవీ. అక్కినేని కుటుంబానికి జ‌రిగిన అవ‌మానానికి కొండా సారీ చెప్ప‌లేద‌ని, కేవ‌లం స‌మంత‌కు మాత్ర‌మే సారీ చెప్పింద‌నేది ఆర్జీవీ ఉద్ధేశం కావొచ్చు. `శివ‌` సినిమాతో త‌న‌ను డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యం చేసిన అక్కినేని నాగార్జున‌కు ఆర్జీవీ నిజ‌మైన కృత‌జ్ఞ‌త ఇలా తీర్చుకుంటున్నాడ‌న్న‌మాట‌!

Tags:    

Similar News