హీరో కుమార్తె ఫోన్ నెంబ‌ర్ ఇలా లీక్ చేస్తేస్తే ఎలా?

తాజాగా అన‌న్య పాండే-సుహానాఖాన్ ఫోన్ నెంబ‌ర్లు కూడా అలా లీక్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అన‌న్యా పాండే ఓ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా రివీల్ చేసింది.

Update: 2024-10-04 16:30 GMT

సెల‌బ్రిటీల ఫోన్ నెంబ‌ర్లు ఎంతో గోప్యంగా ఉంటాయి. వాళ్ల ఫోన్ నెంబ‌ర్లు కేవ‌లం మేనేజ‌న‌ర్లు..వాళ్ల ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్స్ వ‌ద్ద మాత్ర‌మే ఉంటాయి. కొంత మంది మీడియా ప్ర‌తినిధుల వ‌ద్ద ఉంటాయి. అది వాళ్ల మ‌ధ్య ఉన్న అండ‌ర్ స్టాండింగ్ ని బ‌ట్టి ఉంటుంది. పొర‌పాటున అవి ఎట్టింట ఎక్క‌డైనా లీకైతే ఎలా ఉంటుందో తెలిసిందే. అందులోనూ ఆక‌తాయిల చేతికితే వాళ్ల ప‌ని అయిపోయిన్ట‌లే. ఎన్నో ర‌కాలుగా ఇబ్బంది పెట్టే అవ‌కాశం ఉంటుంది.

తాజాగా అన‌న్య పాండే-సుహానాఖాన్ ఫోన్ నెంబ‌ర్లు కూడా అలా లీక్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అన‌న్యా పాండే ఓ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా రివీల్ చేసింది. అన‌న్యా పాండే-సుహానాఖాన్ చిన్న‌ప్ప‌టి నుంచి ప్రెండ్స్. స్కూల్ ,కాలేజీ మేట్స్. అనన్యా పాండే న‌టిస్తోన్న సైబ‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం `సీటీఆర్ ఎల్` రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా నెట్ ప్లిక్స్ ఇండియాకి అమ్మ‌డు ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఈనేప‌థ్యంలోనే ఫోన్ నెంబ‌ర్ల లీక్ వ్య‌వ‌హారం బ‌య‌ట పెట్టింది.

`నేను పొరపాటున ఓ నా సొంత నంబర్‌ను లీక్ చేసాను. కొంత‌మంది జర్నలిస్ట్ లు నా వ‌ద్ద‌కు వ‌చ్చి ఫోన్ నెంబ‌ర్ కావాల‌ని అడిగారు. త‌మ ప్రోఫెష‌న్ లో భాగంగా అవ‌స‌ర‌మైన‌ప్పుడు అందుబాటులో ఉండ‌టానికి అలా అడిగారని, నేను కూడా న‌మ్మి ఇచ్చాను. త‌ర్వాత ఆ నెంబ‌ర్ యూట్యూబ్‌లో వైర‌ల్ అయింది. అలా ఎందుకు జ‌రిగిందో నాకు తెలియ‌దు. ఆ త‌ర్వాతే అర్ద‌మైంది అలా ఎవ‌రికీ ఫోన్ నెంబ‌ర్లు ఇవ్వ‌కూడ‌ద‌ని.

అలాగే సుహానాఖాన్ ఫోన్ నెంబ‌ర్ కూడా ఓసారి సోష‌ల్ మీడియాలో అనుకోకుండా లీక్ చేసాను. `ఒకసారి నేను పొరపాటున సుహానా ఖాన్ నంబర్‌ను కూడా లీక్ చేశాను. ఆమెకి ఫోన్ చేసినా ఎంత‌కీ ఫోన్ తీయ‌డం లేద‌ని...దీంతో ఆమె నెంబ‌ర్ తాలుకా స్క్రీన్ షాట్ ఒక‌టి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టాను. అప్పుడు అందులో నెంబ‌ర్ ఉంద‌ని గ‌మ‌నించ‌లేదు. ఆ త‌ర్వాత కాసేపటికీ అది డిలీట్ చేసాను. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది` అని తెలిపింది.

Tags:    

Similar News