గుర్తు పట్టనంత అందంగా 'నాని గ్యాంగ్ లీడర్' సిస్టర్
నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన 'నాని గ్యాంగ్ లీడర్' సినిమాలో ముఖ పాత్రలో శ్రియ కొణతం కనిపించింది.
నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన 'నాని గ్యాంగ్ లీడర్' సినిమాలో ముఖ పాత్రలో శ్రియ కొణతం కనిపించింది. నాని వెంట ఉండే మొత్తం అయిదు జనరేషన్ ల ఆడవారిలో ఒక అమ్మాయి పాత్రలో శ్రియ కొణతం కనిపించింది. నాని ని చెల్లి అంటూ పిలిచి, కొన్ని సన్నివేశాల్లో ఎమోషనల్ గా నటించి మెప్పించిన శ్రియ కొణతం ఇప్పుడు గుర్తు పట్టనంత గా మారి పోయింది. ఆ సినిమాలో పెద్ద సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టిన శ్రియ కొణతం ఇప్పుడు మాత్రం అందరి కళ్లు పెద్దవి చేసుకుని చూసే మాదిరిగా చాలా అందంగా కనిపిస్తుంది.
నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిన తర్వాత sh ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. ఆమె ను పలువురు ఫిల్మ్ మేకర్స్ సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆమె సున్నితంగా తిరస్కరించిందట. సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ప్రస్తుతం చదువు పై ఎక్కువ ఫోకస్ పెట్టాలనే ఉద్దేశ్యంతో సినిమాలకు దూరంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం శ్రియ రెగ్యులర్ గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో శ్రియ కొణతంకు దాదాపు 40K ఫాలోవర్స్ ఉన్నారు.
శ్రియ గ్యాంగ్ లీడర్ సినిమాలో కళ్లద్దాలు పెట్టుకుని చెల్లి పాత్ర చేయడం ద్వారా ఆ సమయంలో చాలా మంది ఈమె హీరోయిన్ గా పనికి రాదేమో అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం శ్రియ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలను చూస్తూ ఉంటే ముందు ముందు వరుసగా ఈమె సినిమాలు చేయాలని, అది కూడా హీరోయిన్ గా సినిమాలు చేయాలని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా శ్రియ కొణతం వరుసగా సోషల్ మీడియా పోస్ట్ లు పెట్టడం ద్వారా హీరోయిన్ గా ముందు ముందు ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఆ సినిమాలో పద్దతిగా కనిపించిన శ్రియ కొణతం ఈమధ్య సోషల్ మీడియాలో కాస్త బోల్డ్ పిక్చర్స్ షేర్ చేయడంతో పాటు, స్కిన్ షో చేస్తూ ఉంది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈమె సొంతం అవ్వడం, పైగా ఈమె స్కిన్ షో కు ఓకే చెబుతున్న కారణంగా ముందు ముందు భారీగా సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హీరోయిన్ పాత్రలకు శ్రియ కొణతం లుక్ సరిగ్గా సెట్ అవుతుందని, ఆమె ముందు ముందు టాలీవుడ్ తో పాటు, కోలీవుడ్ లోనూ మంచి ఆఫర్లు దక్కించుకుని సినిమాలు చేస్తుందేమో చూడాలి.