అనుష్క‌ను ప్రేమించిన కుర్ర‌హీరో?

స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి గురించి ఆన్‌లైన్‌లో చాలా గాసిప్పులు షికార్ చేస్తున్నాయి.

Update: 2024-10-04 13:30 GMT

స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి గురించి ఆన్‌లైన్‌లో చాలా గాసిప్పులు షికార్ చేస్తున్నాయి. అవ‌న్నీ నిజ‌మేన‌ని త‌ను అంగీక‌రించే వ‌ర‌కూ పెళ్లి వార్త‌ల‌ను న‌మ్మలేని ప‌రిస్థితి. సెల‌బ్రిటీల‌పై ఏదో ఒక పుకార్ షికార్ చేస్తుంటే, ఇలాంటి సెన్సిటివ్ విష‌యాలు వివాదాల‌కు తావిస్తున్నాయి. కానీ ఇప్పుడు టాపిక్ ఇది కాదు. అనుష్క గురించి అస‌లే కాదు.. ది గ్రేట్ ట్యాలెంటెడ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఫ్యాష‌నిస్టా అనుష్క శ‌ర్మ గురించిన స‌మాచారం ఇది.

అనుష్క‌తో యువ‌హీరో అర్జున్ క‌పూర్ నిండా ప్రేమ‌లో మునిగాడ‌నే ర‌హ‌స్యాన్ని క‌ర‌ణ్ జోహార్ బ‌య‌ట‌పెట్టాడు. అత‌డు త‌న ఫేమ‌స్ షో `కాఫీ విత్ క‌ర‌ణ్` (కేడ‌బ్ల్యూకే)లో ఈ విష‌యాన్ని రివీల్ చేసాడు. ఇది త్రోబ్యాక్ ఎపిసోడ్. అయినా ఇప్పుడు మ‌రోసారి కుర్ర‌హీరో అర్జున్ క‌పూర్ పాత ప్రేమ గురించిన వ్య‌వ‌హారం మ‌ళ్లీ చ‌ర్చ‌గా మారింది.

అర్జున్ క‌పూర్ స‌హ‌నటీమ‌ణుల‌తో ప్రేమాయ‌ణాలు సాగించ‌డంలో స్పీడ్ గా ఉంటాడ‌ని టాక్ ఉంది. ఇంత‌క‌ముందు మ‌లైకా అరోరాతో అత‌డు కొన్నేళ్ల పాటు స‌హ‌జీవ‌నంలో ఉన్నాడు. కానీ ఇటీవ‌లే ఈ జంట బ్రేక‌ప్ అయింది. అనంత‌రం ఎవ‌రి దారిలో వారు ఉన్నారు. అర్జున్ వేరొక యువ‌హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడ‌న్న ప్ర‌చారం కూడా ఉంది.

ఇక అనుష్క శర్మ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట‌కు పిల్ల‌లు ఉన్నారు. వారితో ప్ర‌స్తుతం లండ‌న్ లో నివ‌శిస్తున్నారు. అయితే అర్జున్ కపూర్ అనుష్క శ‌ర్మ‌తో ప్రేమలో ఉన్నాడని `కాఫీ విత్ కరణ్` సీజన్ 8, ఎపిసోడ్ 5లో కరణ్ జోహార్ నేరుగా ఆమెకే చెప్పాడు. దానికి అనుష్క శ‌ర్మ లైవ్ లోనే షాక్ కి గురైంది. ఎపిసోడ్‌లోని పాత వీడియోలో కేజేవో ఏమ‌న్నారంటే.. ``అతను (అర్జున్ కపూర్) ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకోవడం చాలా ముఖ్యం.. నీకు అది నిజమే అని తెలుసా?`` అని ప్ర‌శ్నించ‌గా, ఈ విషయం తెలుసుకున్న అనుష్క -కత్రినా (కాఫీ బెడ్ పై ఉన్న స్టార్లు) ఇద్దరూ షాక్ అయ్యారు. అయితే ఇది విన్న త‌ర్వాత అనుష్క శర్మ నేషనల్ టీవీలో ఇవన్నీ చెప్పవద్దని కరణ్‌ని కోరింది. అర్జున్ కపూర్ తన గురించి ఎలాంటి ఫీలింగ్ తో ఉన్నాడో తనకు తెలియదని, అతడు తనతో ప్రేమలో లేడని అంది... ఈ వీడియో మ‌రోసారి వేగంగా వైర‌ల్ అవుతోంది.

అనుష్క శ‌ర్మ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ఝులన్ గోస్వామి బయోపిక్ `చక్దా ఎక్స్‌ప్రెస్` ఇంకా విడుదల కావాల్సి ఉంది. అర్జున్ తదుపరి రోహిత్ శెట్టి `సింగం ఎగైన్‌`లో క‌నిపిస్తాడు. అజయ్ దేవగన్, కరీనా కపూర్ ఖాన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, దీపికలతో క‌లిసి అత‌డు కనిపించనున్నారు. ఈ దీపావళికి యాక్షన్ మూవీ థియేట‌ర్లలోకి రానుంది.

Tags:    

Similar News