అదే భార్య ఉంటే NYE ప్రయోజనమేంటి? ఆర్జీవీ ప్రశ్న!
కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్న మానవాళికి ఆర్జీవీ ఇచ్చిన సందేశం ఏమిటో ఇప్పటికైనా అర్థమై ఉండాలి.
కొత్తొక వింత.. పాతొక రోత అన్నారు! ఆర్జీవీ (RGV) కూడా ఇంచుమించు అదే అన్నాడు. కొత్త సంవత్సరంలో కూడా మీకు అదే బాస్ .. అదే భార్య ఉంటే, కొత్త సంవత్సరం యొక్క ప్రయోజనం ఏమిటి? అని సూటిగా ప్రశ్నించాడు. #హ్యాపీ ఓల్డ్ ఇయర్ అంటూ 2024 కి మాత్రమే శుభాకాంక్షలు తెలిపాడు. కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్న మానవాళికి ఆర్జీవీ ఇచ్చిన సందేశం ఏమిటో ఇప్పటికైనా అర్థమై ఉండాలి. ఇంకా మీకు పాత భార్య ఉంటే.. ఇంకా మీరు అదే ఆఫీస్ లో పని చేస్తూ ఉంటే కచ్ఛితంగా ఇది మీకు కనెక్టయి ఉండాలి.
ఇదొక్కటే కాదు.. ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ ఇంకా చాలా చెప్పారు. ''నేను చేసిన 7 కొత్త సంవత్సర తీర్మానాల సెట్ ఇక్కడ ఉన్నాయి'' అని ఆర్జీవీ అన్నారు. అవేంటో చూద్దాం...
1. నేను వివాదరహితుడిగా మారతాను
2. కుటుంబ వ్యక్తి అవుతాను
3. నేను దేవుడికి భయపడేవాడిని అవుతాను
4. ప్రతి సంవత్సరం 10 'సత్య' తరహా సినిమాలు చేస్తాను
5. నేను ట్వీట్ చేయడం మానేస్తాను
6. నేను స్త్రీల వైపు చూడను
7. నేను వోడ్కా తీసుకోవడం మానేస్తాను
మరియు నేను మీ అందరిపై ప్రమాణం చేస్తున్నాను..
`హ్యాపీ ఓల్డ్ ఇయర్` అంటూ మరోసారి శుభాకాంక్షలు తెలిపాడు.
రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా.. ఏం మాట్లాడినా దానికి ఒక పర్పస్ లేదు. అందువల్ల దీనిని ఎవరూ పట్టించుకోకపోవడమే కొత్త సంవత్సర రిజల్యూషన్!! అని యూత్ సరదాగా కామెంట్ చేస్తున్నారు.