RGV డెన్.. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారంటే?

అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని చూస్తున్న వారికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మంచి ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే

Update: 2024-06-10 14:41 GMT

సాధారణంగా చాలా మంది సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ కలలను సాకారం చేసుకోవాలనుకుంటారు. యాక్టర్లుగా, డైరెక్టర్లుగా, మ్యూజిక్ డైరెక్టర్లుగా తమ సత్తా చాటాలని కలలు కంటారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తొలి అడుగు వేసేందుకు ఎదురుచూస్తుంటారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సక్సెస్ సాధించాలని అనుకుంటారు. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని చూస్తున్న వారికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మంచి ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే

హైదరాబాద్ లో ఆర్జీవీ.. డెన్ ను కొన్నాళ్ల క్రితం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి అక్కడే తాను తెరకెక్కించిన సినిమా వర్క్స్ ను పూర్తి చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం డెన్‌ నుంచి ఒక ప్రకటన వచ్చింది. డైరెక్టర్స్, రైటర్స్, మ్యూజిక్ కంపోజర్స్ కావాలంటూ వర్మ ట్వీట్ చేశారు. ఎందులో ఆసక్తి ఉన్నా సరే.. తమ డెన్ ఆహ్వానం పలుకుతుందని తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను వెబ్ సైట్ లో ఉంచారు.

ఇక రామ్ గోపాల్ వర్మ.. డెన్ నుంచి వచ్చిన ట్వీట్ కు మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అనేక మంది నమోదు చేసుకున్నారని రామ్ గోపాల్ వర్మ ఇటీవల తెలిపారు. రీసెంట్ గా సెలెక్ట్ అయిన వారి లిస్ట్ ను అనౌన్స్ చేశారు ఆర్జీవీ. 419 మంది డైరెక్టర్స్ గా నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అందులో 11 మందిని ఎంచుకున్నట్లు చెప్పారు. https://rgvden.com వెబ్ సైట్ లో 11 మంది పేర్లను మెన్షన్ చేశారు.

మ్యూజిక్ డైరెక్టర్స్ గా తొమ్మిది మందిని సెలెక్ట్ చేశానని ఆర్జీవీ తెలిపారు. అందులో ఒకరు మాత్రమే ఫైనల్ గా సెలెక్ట్ అవుతారని చెప్పారు. మరోవైపు, డెన్ లో యాక్టర్స్ కు కూడా ఛాన్స్ ఉందని ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఇటీవల తెలిపారు. అందుకు 1000 మందికి పైగా అప్లై చేసుకున్నారని, కానీ కేవలం ఫోటోస్ ద్వారా సెలెక్ట్ చేయడం చాలా కష్టంగా మారిందని చెప్పారు. అందుకే వారంతా మరోసారి నమోదు చేసుకోవాలని కోరారు.

డైలాగ్ చెప్పి వీడియో షూట్ చేసి జూన్ 20 లోపు డెన్ వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. కెమెరామెన్స్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్నవారు కూడా అదే డేట్ లోపు నమోదు చేసుకోవచ్చని అన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే ఇండస్ట్రీకి ఎందరినో ఆర్జీవీ ఇంట్రడ్యూస్ చేసిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు డెన్ లో అడుగుపెట్టేవారెవరో చూడాలి.

Tags:    

Similar News