మెగాస్టార్ పై ఆర్జీవీ కూడా సెటైర్ వేసేశాడు
మెగా ఫ్యామిలీపై నిత్యం ఏదో ఒక విధంగా కామెంట్స్ చేస్తూ వారి అభిమానులని రెచ్చగొట్టడం రామ్ గోపాల్ వర్మ పనిగా పెట్టుకున్నారు.
మెగా ఫ్యామిలీపై నిత్యం ఏదో ఒక విధంగా కామెంట్స్ చేస్తూ వారి అభిమానులని రెచ్చగొట్టడం రామ్ గోపాల్ వర్మ మొదటి నుంచి పనిగా పెట్టుకున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆపైన నిత్యం ట్వీట్ లు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో ఆర్జీవీకి కూడా మెగా ఫ్యాన్స్ నుంచి, నాగబాబు లాంటివారి నుంచి రియాక్షన్స్ ఎదురయ్యాయి. అయిన కూడా తగ్గేదిలే అన్నట్లుగానే ఆర్జీవీ కామెంట్స్ ఉంటాయి. ఆ మధ్య భోళా శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది ఆర్జీవీని ఉద్దేశిస్తూ కొన్ని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ఒక పెగ్గు వేసినపుడు మెగాస్టార్ ని, రెండు పెగ్గులు వేసినపుడు పవర్ స్టార్ ని విమర్శించే డైరెక్టర్ ఒకరున్నారు. వారి వ్యూహం ఫలించదు అంటూ పరోక్షంగా చురకలు అంటించారు. అయితే వాటిపై ఆర్జీవీ వెంటనే రియాక్ట్ కాలేదు. తాజాగా భోళా శంకర్ మూవీ రిలీజ్ అయ్యింది. థియేటర్స్ లో మూవీకి మిక్స్డ్ టాక్ వస్తోంది. దీనిపై ఆర్జీవీ తనదైన శైలిలో ట్వీట్ లు వేశారు. ఆ ట్వీట్ తో రెచ్చగొట్టే పేరయత్నం చేశారని చెప్పాలి.
జబర్, హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి, రియాల్టీకి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది. పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఉండరు. రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే అంటూ రెండు ట్వీట్ లు వేశారు. ఇవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ట్వీట్ లపై కొంతమంది మెగా ఫ్యాన్స్ ఆర్జీవీకి కౌంటర్ గా విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే మెగా వ్యతిరేకులు మాత్రం ఆర్జీవీ కామెంట్స్ ని సపోర్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. హైపర్ ఆది చేసిన విమర్శలతో పాటు, జబర్దస్త్ టీం భోళా శంకర్ లో చేసే హంగామా, పొగడ్తలపైన ఆర్జీవీ తన ట్వీట్ తో కౌంటర్ వేశారని అర్ధమవుతోంది.
గతంలో మెగాస్టార్ చిరంజీవితో ఆర్జీవీ చెప్పాలని ఉంది అనే మూవీ స్టార్ట్ చేసి సగం షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఆపేసారు. తరువాత మళ్ళీ రామ్ గోపాల్ వర్మతో మూవీ చేసే ప్రయత్నం చేయలేదు. అప్పటి నుంచి ఆర్జీవీకి మెగాస్టార్ తో కయ్యం నడుస్తూనే ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట.