రిచా చద్దా ఇండో-బ్రిటీష్ అటెంప్ట్!
కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు బాలీవుడ్ ని దాటి ఏకంగా అంతార్జాతీయ స్థాయి లో ఓ భారీ ప్రయత్నం చేస్తుంది.
బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా కెరీర్ జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగిపోతున్న సంగతి తెలిసిందే. సీనియర్ బ్యూటీ ఆరంభంలో ఓఊపు తీసుకొచ్చినా తర్వాత ఆ వేగాన్ని కొనసాగించ లేకపోయింది. దీంతో అమ్మడు స్టార్ లీగ్ లో చేరలేకపోయింది.
కెరీర్ గ్యాప్ లేకుండా వచ్చిన అవకాశాలతో బండి లాంగిచడం తప్ప! రిచా బ్రాండ్ ఇమేజ్ ఇదని చాటి చెప్ప లేకపోయింది . గతేడాది పూర్తిగా ఖాళీ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా అమ్మడు మరో సినిమా తో ముందుకొస్తుంది.
కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు బాలీవుడ్ ని దాటి ఏకంగా అంతార్జాతీయ స్థాయి లో ఓ భారీ ప్రయత్నం చేస్తుంది. 'అయినా' అనే ఇంటర్నేషనల్ సినిమా లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే లండన్ లో మొదలైంది. ఇదొక ఇండో-బ్రిటీష్ చిత్రం. ఇందులో రిచా 'కార్నికల్స్ ఆఫ్ నార్నియా' ఫేం విలియం మోస్లేకి జంటగా నటిస్తోంది. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా చిత్రాన్ని మార్కస్ మిడ్జ్ తెరకెక్కిస్తున్నారు. రిచా కెరీర్ లో ఈ తరహా ప్రయత్నం తొలిసారి.
ఇప్పటివరకూ బాలీవుడ్ లోనే మెప్పించిన అమ్మడు ఇతర లాంగ్వేజ్ పైనా దృష్టి పెట్టింది. అయితే ఇండో-బ్రిటీష్ లో సక్సెస్ అయిన నటులు తక్కువనే చెప్పాలి. గతం లో కొంత మంది ఈ తరహా ప్రయత్నాలు చేసారు గానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. హాలీవుడ్ లో కూడా ప్రియాంక చోప్రా సక్సస్ అయినట్లు గా మరో నటి విజయం సాధించలేదు. ఐశ్వర్యారాయ్..దీపికా పదుకొణే లాంటి భామలు ప్రయత్నాలు చేసినా పీసీ రేంజ్ లో అప్లాజ్ రాలేదు.
అలాగే జాకీచాన్ లాంటి నటులు ఇండో-బ్రిటన్ తరహా సినిమాలు చేసారు. అయినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మరి ఈ బ్యూటీ కి ఈ ప్రయత్నం ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి. అలాగే రిచా హిట్ సిరీస్ సీక్వెల్ 'ఫక్రే-3'లోనూ నటిస్తోంది. దీంతో పాటు మరో హిందీ సినిమా కూడా పట్టాలెక్కించింది. 2023-24 లో అమ్మడు ఈ మూడు సినిమా లతో ప్రేక్షకుల ముందుకు రానుంది.