ఫ్యామిలీతో క్రిస్మస్ వేడుకలు.. మిర్చి భామ ఎంతగా మారిపోయిందో..!
మా ఫ్యామిలీ అందరి తరపున మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు.. మీరు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యవంతులుగా జాయ్ ఫుల్ గా ఉండాలని కామెంట్ పెట్టింది రిచా.
మిరపకాయ్, మిర్చి సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని అలరించిన హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కెరీర్ లో కేవలం 9 సినిమాలే చేసినా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. లీడర్ తో కెరీర్ మొదలు పెట్టిన రిచా నాగార్జున భాయ్ సినిమాతో సినిమాలు ఆపేసింది. అర్ధాంతరంగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి యూఎస్ లో ఎం.బి.ఏ చేసేందుకు వెళ్లింది అమ్మడు. అక్కడ బిజినెస్ స్కూల్ లోనే తన క్లాస్ మేట్ జో లాంగెల్లాని పెళ్లాడింది. 2021 లో రిచా ఒక బాబుకి జన్మనిచ్చింది.
సినిమాలకు దూరమైన రిచా తన అప్డేట్స్ ని కూడా బయటకు రానివ్వలేదు. ఈమధ్యనే తన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తుంది రిచా. లేటెస్ట్ గా రిచా క్రిస్మస్ సందర్భంగా ఫ్యామిలీతో వేడుకలు జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేసింది రిచా గంగోపాధ్యాయ.
భర్త బాబుతో సరదాగా అలా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది అమ్మడు. మా ఫ్యామిలీ అందరి తరపున మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు.. మీరు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యవంతులుగా జాయ్ ఫుల్ గా ఉండాలని కామెంట్ పెట్టింది రిచా. సినిమాల్లో చేసేప్పుడు మన అమ్మాయిగా అనిపించిన రిచా పెళ్లై ఒక బాబు పుట్టడం పూర్తిగా యూఎస్ లోనే ఉండటం వల్ల అక్కడ అమ్మాయిలానే అనిపిస్తుంది.
టాలీవుడ్ లో తన కెరీర్ షార్ట్ అండ్ స్వీట్ గా ఉన్నా చేసిన సినిమాలు కూడా మంచివే అవ్వడంతో రిచాని తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని చెప్పొచ్చు. దాదాపు సినిమాలను ఆపేసి ఫ్యామిలీకే తన పూర్తి టైం కేటాయిస్తున్న అమ్మడు తిరిగి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందేమో చూడాలి. తెలుగులో ప్రభాస్, నాగార్జున, రవితేజ, రానా లాంటి హీరోలతో చేయడం వల్ల తను చేసిన తక్కువ సినిమాలతోనే టాలీవుడ్ లో ఒక క్రేజ్ తెచ్చుకుంది రిచా. అయితే సినిమాలకు దూరమైనా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కి తన ఫ్యామిలీ అప్డేట్స్ తో అలరిస్తుంది అమ్మడు. ఈమధ్య పెళ్లైన భామలు కూడా రీ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు. అలా రిచా కూడా తెలుగు తెరమీద మళ్లీ కనిపించే ఛాన్స్ ఉందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.