కాంతార చేతికి బుజ్జి స్టీరింగ్

రిషబ్ శెట్టి ఈ సినిమాలో భైర‌వ న‌మ్మిన బంటు బుజ్జి ప‌వ‌ర్ స్టీరింగ్‌ని తీసుకున్నారు. రోబోటిక్ వాహ‌నాన్ని న‌డిపించాడు

Update: 2024-06-24 16:39 GMT

'కాంతార' చిత్రంతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు రిషబ్ శెట్టి. ప‌రిమిత బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన నేటివిటీ హిస్టారిక‌ల్ థ్రిల్ల‌ర్ కాంతార‌ అద్భుత వ‌సూళ్ల‌ను సాధించ‌డ‌మే గాక న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా రిష‌బ్ శెట్టికి గొప్ప పేరు, గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు రిష‌బ్ శెట్టి 'క‌ల్కి' కోసం ప్ర‌చారం చేయ‌డం క‌న్న‌డిగుల్లో ఆస‌క్తిని పెంచుతోంది.

రిషబ్ శెట్టి ఈ సినిమాలో భైర‌వ న‌మ్మిన బంటు బుజ్జి ప‌వ‌ర్ స్టీరింగ్‌ని తీసుకున్నారు. రోబోటిక్ వాహ‌నాన్ని న‌డిపించాడు. శెట్టి బుజ్జిని కుందాపుర పట్టణం గుండా నడుపుతున్న వీడియోతో పాటు 'కల్కి x కాంతార'ను పోస్ట్ చేసాడు. కుందాపుర ప‌ట్ట‌ణం స‌మీపంలోని ఒక గ్రౌండ్ లో బుజ్జిని డ్రైవ్ చేస్తూ అద్భుతం అంటూ ప్ర‌శంసించాడు. క‌ల్కి సినిమా టీమ్‌కి అత‌డు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ముఖ్యంగా ప్ర‌భాస్ కి రిష‌బ్ శెట్టి శుభాకాంక్ష‌లు చెప్పాడు.

టీమ్ కు శుభాకాంక్షలు తెలియజేయ‌డ‌మే గాక‌.. ప్ర‌భాస్ పై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. జూన్ 27న సినిమా థియేటర్లలో సినిమా చూడాలని సినీ ప్రేక్షకులకు చెప్పారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన 'కల్కి 2898 AD'లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి అగ్ర‌తార‌లు న‌టించారు. ఈ చిత్రం 27 జూన్ 2024న థియేటర్లలోకి రానుంది. క‌ల్కికి కాంతార స‌పోర్ట్ చూశాక‌.. ప్ర‌భాస్- రిష‌బ్‌ల ఫ్రాంఛైజీకి క్రాస్ ఓవ‌ర్ మూవీని తెర‌కెక్కిస్తే బావుంటుంద‌ని కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Read more!
Tags:    

Similar News