ప్రముఖ నటుడు కన్నుమూత

రితురాజ్‌ ఎన్నో హిందీ సిరియల్స్ లో నటించి మెప్పించాడు. సీరియల్స్ ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో కూడా నటించాడు.

Update: 2024-02-20 09:18 GMT

హిందీ బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన రితురాజ్ సింగ్ గుండె పోటుతో మృతి చెందారు. 59 ఏళ్ల రితురాజ్ సోమవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రితురాజ్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

రితురాజ్‌ ఎన్నో హిందీ సిరియల్స్ లో నటించి మెప్పించాడు. సీరియల్స్ ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో కూడా నటించాడు. వరుణ్ దావన్‌, ఆలియా భట్ జంటగా నటించిన హంప్టీ శర్మ కీ దుల్హానియా' చిత్రంలో రితురాజ్ కీలక పాత్రలో నటించి తన నటనతో మెప్పించాడు.

గత కొన్నాళ్లుగా క్లోమం మరియు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రితురాజ్‌ సుదీర్ఘ కాలంగా చికిత్స పొందుతున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల క్రితమే రితురాజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి చేరారట.

నటుడిగా తనదైన ముద్రను వేసిన రితురాజ్ అప్పుడే మృతి చెందడం పట్ల ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

Tags:    

Similar News