దడ దడ ఒకడే కేసరి.. వీడికి వీడేలే సరి
ఇప్పటికే విడుదలైన పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'దడ దడ ఒకడే కేసరి..' అంటూ సాగే లిరికల్ పాటను విడుదల చేసారు. ఈ పాట ఆద్యంతం తమన్ మార్క్ స్పష్ఠంగా కనిపిస్తోంది.
నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' అక్టోబర్ 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ పరిణితి చెందిన నడివయస్కుడిగా కనిపిస్తారు. శ్రీలీల ఇందులో కీలక పాత్రధారి కాగా, బాలయ్య సరసన కాజల్ కనిపించనుంది. అర్జున్ రాంపాల్ విలన్ గా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్‌లో కొందరు పరిశ్రమలోని వ్యక్తుల కోసం ప్రత్యేక షో వేసారు. టాక్ పాజిటివ్‌గా ఉంది. అనిల్ రావిపూడి సినిమాని అద్భుతంగా తీశారని, అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని సినిమా చూసిన కొందరు అంటున్నారు. బాలయ్య భావోద్వేగాలు, స్క్రీన్ ప్రెజెన్స్, థమన్ BGM ప్రధాన హైలైట్స్ అని చెబుతున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు.
ఇప్పటికే విడుదలైన పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'దడ దడ ఒకడే కేసరి..' అంటూ సాగే లిరికల్ పాటను విడుదల చేసారు. ఈ పాట ఆద్యంతం తమన్ మార్క్ స్పష్ఠంగా కనిపిస్తోంది. కాసర్ల శ్యామ్ ఈ పాటను రాసారు. బీట్ ఎంతో ఎనర్జిటిక్ గా సాగుతుండగా బాలయ్య బాబు ఇంట్రోని అద్భుతంగా వర్కవుట్ చేసారు. ఈ పాట విడుదలైన క్షణాల్లోనే వైరల్ గా మారింది.
3 ఏఎం షోలతో దడ:
దర్శకుడు అనిల్ రావిపూడి మాటల్లో చెప్పాలంటే.. నందమూరి బాలకృష్ణ గతంలో ఎన్నడూ ప్రయత్నించని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. శ్రీలీల తండ్రిలాంటి పాత్రలో నటించి సినిమా మిమ్మల్ని ఎమోషనల్ రైడ్ లోకి తీసుకెళుతుంది. అనిల్ రావిపూడి 100 శాతం ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే దర్శకుడు కావడంతో ట్రైలర్‌కి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రముఖుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. వారి కాంబినేషన్ భగవంత్ కేసరిపై అంచనాలను పెంచింది. ట్రైలర్ బజ్ క్రియేట్ చేసింది. నేలకొండ భగవంత్ కేసరి తన మేనకోడలు విజి (శ్రీలీల)కి చురుకైన సంరక్షకుని లాంటి పేరెంట్. అతను భారతీయ ఆర్మీలో చేరాలనే కలను కొనసాగించమని ఆమెను ప్రోత్సహిస్తాడు. అయితే ఆ ఇద్దరి జీవితాల్లోకి ప్రవేశించిన వ్యాపారవేత్త రాహుల్ సంఘ్వీ (అర్జున్ రాంపాల్) ప్రమేయంతో కథ మారిపోతుంది. ఆ తర్వాత కేసరి విరోచిత పోరాటాలు ఎలా ఉంటాయన్నది తెరపై చూడాల్సిందే.
భగవంత్ కేసరి అడ్వాన్స్ బుకింగ్స్ అక్టోబర్ 16 మధ్యాహ్నం 3.55 గం.లకు ఓపెనయ్యాయి. సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. విదేశాల్లో ప్రీమియర్ టికెట్ల అమ్మకాలు సాగుతున్నాయి. విలన్ గా నటించిన బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ తొలిసారి తనకు తానే స్వయంగా తెలుగు డైలాగులు డబ్బింగ్ చెప్పుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. అతడికి ఇదే తొలి తెలుగు సినిమా. ఈ చిత్రంలో నేలకొండ భగవంత్ కేసరిగా నందమూరి బాలకృష్ణ, కాత్యాయనిగా కాజల్ అగర్వాల్, విజయలక్ష్మి అకా వీజీగా శ్రీలీల, శుక్లా పాత్రలో జాన్ విజయ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి రాంప్రసాద్.. తమ్మిరాజు వరుసగా సినిమాటోగ్రాఫర్ గా ఎడిటర్‌గా పనిచేశారు. తమన్ సంగీతం అందించారు.