య‌ష్ హాలీవుడ్ మార్కెట్ కొల్ల‌గొట్టే వ్యూహం?

హాలీవుడ్‌లో ఫ్రాంఛైజీ చిత్రాల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేసి బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల‌ను సాధించ‌డం మ‌నం రెగ్యుల‌ర్ గా చూస్తున్న‌దే.

Update: 2025-02-09 04:32 GMT

హాలీవుడ్‌లో ఫ్రాంఛైజీ చిత్రాల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేసి బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల‌ను సాధించ‌డం మ‌నం రెగ్యుల‌ర్ గా చూస్తున్న‌దే. వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్, డిసి, యూనివ‌ర్శ‌ల్ పిక్చ‌ర్స్ స‌హా ఎన్నో హాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లు రెగ్యుల‌ర్ గా ప్రపంచ స్థాయి సినిమాల్ని అందిస్తున్నాయి. ఇటీవ‌లి కాలంలో భార‌త‌దేశం, చైనా వంటి అధిక జ‌నాభా క‌లిగిన దేశాల్లో హాలీవుడ్ చిత్రాలు విడుద‌లై వంద‌ల కోట్లు వ‌సూలు చేస్తున్నాయి. దీనికోసం హాలీవుడ్ చాలా చొర‌వ తీసుకుంది.

ఇప్పుడు భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌ కూడా హాలీవుడ్ రేంజుకు ఎదిగేస్తోంది. ఈ చొర‌వ టాలీవుడ్, బాలీవుడ్ స‌హా ప‌లు పరిశ్ర‌మ‌ల్లో స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. క‌న్న‌డ సినీరంగంలో కొంద‌రు ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌కులు ఇలాంటి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్పుడు కేజీఎఫ్ ఫేం య‌ష్ న‌టిస్తున్న టాక్సిక్ చిత్రాన్ని వ‌రల్డ్ వైడ్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని చిత్రీక‌రిస్తున్నార‌ని స‌మాచారం. ద‌ర్శ‌కురాలు గీతు మోహ‌న్ దాస్ కి అంత‌ర్జాతీయంగా ఉన్న గుర్తింపు దృష్ట్యా టాక్సిక్ ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్లాన్ చేయ‌డ‌మే గాక‌, భారీ రిలీజ్ ని ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఈ సినిమాని క‌న్న‌డం, ఇంగ్లీష్ లో రూపొందించి భార‌త‌ దేశంలోని ఇత‌ర భాష‌ల్లోకి అనువ‌దించ‌నున్నారు.

`టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్` ఒక‌ గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ ఆస‌క్తిని పెంచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ లోను ఆస‌క్తిని పెంచుతోంది. అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని, టాక్సిక్‌ను ప్రపంచ స్థాయిలో నిర్మిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ - మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆంగ్లంలోను భారీ రిలీజ్ దృష్ట్యా అద‌నంగా మ‌రో 40-50 శాతం బ‌డ్జెట్ పెర‌గ‌నుంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు టాక్సిక్ కి ఈ స్థాయిలో బ‌డ్జెట్ ని వెచ్చిస్తున్నారు అంటే దానికి కార‌ణం ద‌ర్శ‌కురాలు గీతూ మోహ‌న్ దాస్ పై న‌మ్మ‌కం. గీతూ ఫిలింమేకింగ్ ఎబిలిటీ ప్ర‌ధాన కార‌ణం. ఇప్ప‌టికే జాతీయ అవార్డ్ సినిమాల‌ను రూపొందించిన గీతూ మోహ‌న్ దాస్ గ‌తంలో సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులను గెలుచుకుని, అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు పొందారు.

గీతు మోహన్‌దాస్ సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2016లో గ్లోబల్ ఫిల్మ్ మేకింగ్ అవార్డును అందుకున్నారు. ప్రపంచ సినిమా వేదిక నుండి వచ్చిన కొత్త ఫిలింమేక‌ర్స్ కి వారు అందించిన నెక్ట్స్ లెవ‌ల్ స్క్రీన్‌ప్లే ని విశ్లేషించ‌డం ద్వారా ఈ అవార్డును అందిస్తారు. 34 ఏళ్ల గీతూ త‌న చిత్రం `ఇన్షా అల్లా` కోసం ఈ గౌర‌వాన్ని అందుకున్నారు. ఈ చిత్రం ఐరన్ మ్యాన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జాన్ విక్ వంటి ప్రధాన ఫ్రాంచైజీలలో పనిచేసిన జెజె పెర్రీ సహా అగ్రశ్రేణి అంతర్జాతీయ ప్రతిభను, సాంకేతిక నిపుణులను కూడా ఆకర్షించింది. 2013లో `లైయర్స్ డైస్` చిత్రానికి గీతూ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. క్యూబా నుండి అర్మాండో కాపో, మొరాకో చిత్రనిర్మాత అబ్దుల్లా తయా , ఆంటోనియో పియాజ్జా, ఇటలీ నుండి ఫాబియో గ్రాసడోనియా కూడా ఈ అవార్డును గెలుచుకున్నారు. గీతూ మోహ‌న్ దాస్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న గుర్తింపు దృష్ట్యా య‌ష్ ఈ చిత్రానికి అత్యంత భారీ బ‌డ్జెట్ ని వెచ్చించేందుకు స‌హ‌క‌రిస్తున్నారు.

Tags:    

Similar News