నోరు అదుపులో పెట్టుకో..డిలీట్ చేయ్! సాయితేజ్
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కు మార్తె నిహారిక వైవాహిక జీవితం గురించి తెలిసిందే
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కు మార్తె నిహారిక వైవాహిక జీవితం గురించి తెలిసిందే. ఇటీవలే చైతన్యతో విడాకులు తీసుకుని నిహారిక కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. విడాకుల నేపథ్యంలో సోషల్ మీడియాలో నిహారికపై నెగిటివ్ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ట్రోలింగ్ బారిన పడింది. తాజాగా నిహారికపై చేసిన ఓ కామెంట్ కి మెగా అల్లు సాయి తేజ్ రియాక్ట్ అయ్యాడు. తనదైన శైలిలో ఆ నెటి జనుడుకి వార్నింగ్ ఇచ్చాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే సాయితేజ్ నటించిన సోల్ ఆఫ్ సత్య ప్రయివేట్ ఆల్బమ్ ఒకటి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భరతమాత కోసం ఎంతో మంది మహిళలు..స్త్రీలు తమ బిడ్డలను..ప్రేమని త్యాగం చేస్తున్నారు. వారందరికీ ఈ పాట అకింతం చేసి పాట రిలీజ్ చేసారు. సోషల్ మీడియాలో ఈ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పాట ప్రమోషన్ కి ముందు నిహారిక స్పందిస్తూ... ఈ పాట కోసం నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను' అని కామెంట్ పోస్ట్ చేసింది.
దీనికి ఓ నెటి జనుడు స్పందిస్తూ.. 'వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫ్యామిలీ మీద లేకపోయే' అంటూ కామెంట్ చేసాడు. ఈ కామెంట్ సాయితేజ్ చూసాడు. వెంటనే ఆయన ఆ కామెంట్ పై సీరియస్ అయ్యాడు. 'నోరు అదుపులో పెట్టుకో...వెంటనే కామెంట్ డిలీట్ చేయ్' అని వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన చాట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ కామెంట్స్ ని ఇన్ స్టా నుంచి ఎవరికి వారు డిలీట్ చేసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ కనిపించలేదు.
సాయితేజ్ వార్నింగ్ కి భయపడి అతగాడు కామెంట్ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది అనవసరమైన చర్చకు దారి తీస్తుందని సాయితేజ్ కూడా తన కామెంట్స్ ని డిలీట్ చేసి ఉండొచ్చు. నిహారికపై ఇలాంటి కామెంట్లు విడాకుల తీసుకున్న సమయంలో చాలా కామెంట్లు వైరల్ అయ్యాయి. అలాగే నిహారిక పబ్ ఘటన..అటుపై పోలీస్ స్టేషన్ వెళ్లిన సమయంలోనూ ఆమెపై చాలా నెగిటివ్ కామెంట్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే.