మంచి రివ్యూ బ్యాడ్ సినిమాను కాపాడలేదు!: శైలేష్
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్.. ఇటీవలే సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్.. ఇటీవలే సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అయిందీ మూవీ. హిట్ ఫేమ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. మిక్స్ డ్ టాక్ అందుకుంది. రిలీజ్ కు ముందు సినీ ప్రియులు ఈ మూవీపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయింది.
వెంకటేశ్ 75వ సినిమా అవ్వడం, శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీలతో ఫాంలో ఉండటంతో సైంధవ్ మీద మామూలుగానే అంచనాలుంటాయి. ఇక టీజర్, ట్రైలర్ అల్ట్రా స్టైలీష్‌గా ఉండటంతో అందరి దృష్టిని సైంధవ్ ఆకర్షించింది. తీరా సినిమా చూశాక ఆడియెన్స్ కాస్త నిరుత్సాహపడిపోయారు. కానీ వెంకీ మామ స్టైలీష్ యాక్షన్స్, నవాజుద్దిన్ సిద్దిఖీ కామెడీ, విలనిజం హైలెట్‌గా నిలిచాయని ఆడియెన్స్ తెలిపారు.
వెంకీ మామ స్టోరీ లైన్ బాగుందని కానీ ఎమోషన్ కంటే వయలెన్స్ ఎక్కువగా ఉందన్న కంప్లైంట్ ఎక్కువగా వినిపిస్తూ వస్తోంది. తండ్రి కూతురు ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆండ్రియా, ఆర్య తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే వెంకటేశ్ హైదరాబాద్‌లోని పలు థియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల స్పందనను నేరుగా చూశారు. అందుకు సంబంధించిన వీడియోను శైలేష్ ఎక్స్ (ఇంతకు ముందు ట్విటర్)లో పోస్ట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"మంచి రివ్యూ ఓ సినిమాను కాపాడదు. బ్యాడ్ రివ్యూ మంచి చిత్రాన్ని దెబ్బతీయదు. ఏది ఏమైనా మంచి సినిమాకు ప్రేక్షకాదరణ తప్పక లభిస్తుంది. మౌత్ టాక్ తోపాటు ప్రేక్షకుల సెన్సిబిలిటీ పై నాకు నమ్మకం ఉంది. వరుస చిత్రాలు రిలీజవుతున్నప్పట్టికీ.. సైంధవ్ కు వచ్చే ఆడియెన్స్ సంఖ్య స్థిరంగానే ఉంది. మేం ఈ సంక్రాంతికి విభిన్న కథా చిత్రాన్ని అందించాం. ఎలాంటి రివ్యూలు వచ్చినా.. చాలా మంది థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూస్తుండడం ఆనందంగా ఉంది. సైంధవ్ రిలీజ్ అయ్యి రెండో రోజులే అయింది. సినిమా ఫుల్ రన్ తర్వాత మీతో మాట్లాడుతా" అని తెలిపారు శైలేష్.
శైలేష్ కొలను మొదట హిట్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందికున్నాడు. అనంతరం హిట్ 2 తో కూడా పరవాలేదు అనిపించాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ సైంధవ్ సినిమాతో మరీంత విభిన్నమైన ప్రయత్నం చేశాడు. ఇక ఈ సినిమా అనంతరం నాని తో హిట్ సీరీస్ ను కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నాడు శైలేష్. త్వరలోనే ఆ సినిమాపై క్లారిటీ రానుంది.