సైంధవ్ 17 కోట్ల ఇంజక్షన్.. డైరెక్టర్ ఏమన్నాడంటే

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కి సంక్రాంతికి రాబోతున్న మూవీ సైంధవ్

Update: 2024-01-04 03:58 GMT

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కి సంక్రాంతికి రాబోతున్న మూవీ సైంధవ్. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. వెంకటేష్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. ఇదిలా ఉంటే ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజుల తర్వాత విక్టరీ వెంకటేష్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే సాలిడ్ యాక్షన్ అండ్ డ్రామా మూవీ రాబోతోందని సైంధవ్ ట్రైలర్ తోనే అర్ధమైంది.

ఈ ట్రైలర్ లో వెంకటేష్ కూతురుకి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే రేర్ డిసీజ్ వస్తుంది. ఈ ట్రీట్మెంట్ కి ఒక ఇంజక్షన్ కావాలి. దాని వేల్యూ 17 కోట్లు. కూతురుని బ్రతికించుకోవడం 17 కోట్ల విలువ చేసే ఆ ఇంజక్షన్ ని హీరో ఎలా సంపాదించాడు. మాఫియాతో ఎందుకు తలపడాల్సి వచ్చింది అనేది మూవీలో కోర్ పాయింట్ గా శైలేష్ కొలను తీసుకున్నాడు. దీనిపై ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మరింతగా శైలేష్ క్లారిటీ ఇవ్వడం విశేషం.

ఆ ఇంజక్షన్ అనేది ఎంత వరకు రియాలిటీకి దగ్గరగా ఉంటుందని అనుకుంటున్నారు అని ఓ జర్నలిస్ట్ శైలేష్ ని ప్రశ్నించారు. నిజంగానే ఆ డిసీజ్ ఉందని. బాడీలో ఒక జీన్ లేకపోవడం వలన చిన్న వయస్సు పిల్లలలో ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే డిసీజ్ వస్తోందని చెప్పాడు. ఈ మధ్యకాలంలో దీని గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఈ ట్రీట్మెంట్ కోసం ఫండ్ రైజింగ్ చేస్తున్నారు.

పక్కా సమాచారంతో క్లారిటీతోనే దానిని మెయిన్ పాయింట్ గా తీసుకొని కథ మొత్తం అల్లుకోవడం జరిగిందని చెప్పుకొచ్చాడు. ఈ మూవీతో తాను ఎలాంటి సోషల్ మెసేజ్ లు ఇవ్వాలని అనుకోలేదని కూడా చెప్పుకొచ్చాడు. ఇందులో చూపించిన డిసీజ్ కి సంబందించిన ఇప్పుడిప్పుడే పరిశోధనలు కూడా జరుగుతున్నాయని. బెటర్ సొల్యూషన్ కూడా భవిష్యత్తులో రావొచ్చని చెప్పాడు.

సైంధవ్ సినిమాలో అయితే కూతురు ప్రాణాలు కాపాడటం కోసం ఒక తండ్రి ఎలాంటి పోరాటం చేశాడు అనేది కథలో భాగంగా చూపించే ప్రయత్నం శైలేష్ చేస్తున్నట్లు ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. ఈ కొత్త పాయింట్ ని ఆడియన్స్ ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.

Tags:    

Similar News