సాయిపల్లవికి అక్కడ అన్ని కోట్లు ఇస్తున్నారా?
అవును అక్షరాల 10 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటుందిట. దక్షిణాది పారితోషికంతో పొల్చితే అక్కడ రెట్టింపు అందుకుంటుందని తెలుస్తోంది.
నేచురల్ పెర్పార్మర్ సాయిపల్లవి ఎంతటి ప్రతిభావంతురాలన్నది చెప్పాల్సిన పనిలేదు. కటౌట్ కాకపోయినా తనలో ఉన్న కంటెంట్ తో రాణిస్తోన్న నటి ఆమె. అందుకే ఎంత మంది కొత్త భామలొచ్చినా ఆమెకి పోటీ కాదనే చెప్పాలి. నెంబవర్ వన్ రేసులో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా! సాయి పల్లవికంటూ ప్రత్యేకమైన ట్రాక్ వేసుకుని ముందు కెళ్తుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుంది. కేవలం డీసెంట్ పాత్రల మాత్రమే చేస్తుంది. అందులోనూ నటనకు ఆస్కారం ఉండాలి. ఇలా తనకంటూ కొన్ని నియమ నిబంధనలున్నాయి.
ఆ ప్రకారం ముందుకెళ్తుంది. అందుకు తగ్గ అవకాశాలే అమ్మడు అందుకుంటుంది. ఇక్కడ ఆమె ఒక్కో సినిమాని నాలుగు నుంచి ఐదు కోట్లు పారితోషికం అందుకుంటుంది. నిర్మాతల్ని అధికంగా డిమాండ చేస్తోందనిగానీ.... అదనపు భారాలు మోపుతుందని గానీ ఏ నాడు తెరపైకి వచ్చింది లేదు. ఎందుకంటే అమ్మడు ఇండస్ట్రీలో కొన్ని ఎథిక్స్ తో ముందుకెళ్లుంది. ఎంతో డౌన్ ఎర్త్ ఉంటుంది. తాను హీరోయిన్ అనే ఫీల్ ని పక్కనబెట్టి అందరితో కలిసి పోయే మనస్థత్వం గలది.
ఆ రకమైన లక్షణం కూడా పల్లవిని తెలుగు ఆడియన్స్ ని మరింత దగ్గర చేసింది. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లో 'రామాయణ్' లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో సీత పాత్రలో నటిస్తోంది. మరి ఈ సినిమాకి అమ్మడు తీసుకునే పారితోషికం ఎంతో తెలిస్తే స్టన్ అవ్వడం ఖాయం. అవును అక్షరాల 10 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటుందిట. దక్షిణాది పారితోషికంతో పొల్చితే అక్కడ రెట్టింపు అందుకుంటుందని తెలుస్తోంది.
మరి డిమాండ్ చేయని హీరోయిన్ కి అంత ఎందుకు ఇస్తారు? అంటే ఇక్కడ తన మార్కెట్ ని బాలీవుడ్ పెంచినట్లు సమాచారం. ఇన్ని కోట్లు ఇవ్వండని సాయిపల్లవి అడగలేదుట. తన ప్రతిభని...ఫాలోయింగ్ ని చూసి దర్శక-నిర్మాతలు ఆమాత్రం చేయాలని నిర్ణయించి ఇచ్చినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది.