'బేబీ' బూతుల వాడకంపై డైరెక్టర్ క్లారిటీ.. ముందే తెలుసంటూ..

సాయి రాజేష్ బేబీ సినిమాలో కూడా కొన్ని సందర్బోచితంగా బూతు సంభాషణలని ఉపయోగించారు. ఒక వర్గం ఆడియన్స్ ఈ డైలాగ్స్ పై విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Update: 2023-07-15 15:13 GMT

సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ జోడీగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం బేబీ. ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కి సినిమా భాగా కనెక్ట్ అయ్యింది. ముక్కోణపు ప్రేమకథలో అందరికి తెలిసిన లవ్ ఫెయిల్యూర్ డ్రామాని చూపించిన కూడా తెరపై దానిని ఆవిష్కరించిన విధానం భాగా నచ్చింది.

అందుకే యువత ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఈ జెనరేషన్ లో యూత్ బూతు సంభాషణలు చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు. కొన్ని సందర్భాలలో అలాంటి బూతు సంభాషణలు ఉంటే కథలో బలం పెరుగుతుంది. బంధాల మధ్య విభేదాలు రావడానికి ఇలాంటి సంభాషణలు కూడా ఒక కారణంగా ఉంటాయనే సంగతి అందరికి తెలిసిందే.

ఈ నేపథ్యంలో దర్శకుడు సాయి రాజేష్ బేబీ సినిమాలో కూడా కొన్ని సందర్బోచితంగా బూతు సంభాషణలని ఉపయోగించారు. ఒక వర్గం ఆడియన్స్ ఈ డైలాగ్స్ పై విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ డైలాగ్స్ పెట్టడానికి కారణం దర్శకుడు సాయి రాజేష్ చెప్పారు. సినిమాలో బూతు డైలాగ్స్ పై అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని ముందే గ్రహించామని అన్నారు.

అయితే ఆ డైలాగ్స్ లేకపోతే కథలో డెప్త్ కి ఆడియన్స్ కనెక్ట్ కాలేరని భావించి వాటిని యధావిధిగా ఉంచడం జరిగిందని తెలిపారు. ఏదో యూత్ ని ఎట్రాక్ట్ చేసే ఉద్దేశ్యంతో అయితే ఆ డైలాగ్స్ పెట్టలేదని, కథకి అవసరం అయ్యి మాత్రమే ఉపయోగించినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి కథలు చెప్పేటపుడు కథలో వేగం పెరగాలంటే కొన్ని బూతు సంభాషణలు వాడాల్సిందే అన్నారు.

అలాగే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ దగ్గర సన్నివేశం లెంత్ ఉందనే కామెంట్స్ వస్తున్నాయని, దానిపై అరవింద్ గారు ముందే సూచించారని అన్నారు. అయితే ఆ సీన్ ని కట్ చేస్తే అమ్మాయి క్యారెక్టర్ ని బ్యాడ్ గా రిప్రజెంట్ చేసినట్లు అవుతుందని భావించి అలా ఉంచడం జరిగిందని చెప్పారు. మొత్తానికి బూతు డైలాగ్స్ అనేవి బేబీ సినిమాకి బలం అని సాయి రాజేష్ చెప్పకనే చెప్పారు.

Tags:    

Similar News