`సలార్ -2` నుంచి కాకపుట్టించే అప్డేట్!
అయితే ఈసినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది ఇంత వరకూ క్లారిటీ లేదు. ప్రభాస్ వేర్వేరు సినిమా లతో బిజీగా ఉండటం...ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అవ్వడంతో పట్టాలెక్కేది ఎప్పుడని అభిమానులు అడుగుతున్నారు.
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన `సలార్` ఫలితం విషయంలో నీల్ ప్రశాంతంగా లేని సంగతి తెలిసిందే. సినిమా విజయం సాధించినా? ఆ విజయం సరిపోదని, వసూళ్ల పరంగా ప్రశాంత్ నీల్ అంచనాలు మాత్రం అందుకోలేకపోయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రశాంత్ నీల్ టార్గెట్ 1000 కోట్లపైనే కానీ...సినిమా బాక్సాఫీస్ వద్ద 650-700 కోట్ల మధ్యనే సాధించింది.
ఈ సినిమా కోసం ప్రభాస్-ప్రశాంత్ నీల్ ఎంతో ఎఫెర్ట్ పెట్టి పనిచేసారు. సినిమా బడ్జెట్ మాత్రమే 300 కోట్లు. దీంతో ఇప్పుడా లెక్కలన్నింటిని `సలార్ -2` తో బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఏకంగా 2000 కోట్ల మార్క్ ని టచ్ చేసే చిత్రమవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. సలార్ విషయంలో కొంత నెగిటివ్ టాక్ కూడా ఉంది. స్టోరీ అర్దం కాలేదనే టాక్ తొలి షో అనంతరం వచ్చింది. రెండవ పార్ట్ విషయంలో అలాంటి వాటికి తావు ఇవ్వకుండా పక్కా ప్లాన్ తో దిగాలని చూస్తున్నారు.
అయితే ఈసినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది ఇంత వరకూ క్లారిటీ లేదు. ప్రభాస్ వేర్వేరు సినిమా లతో బిజీగా ఉండటం...ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అవ్వడంతో పట్టాలెక్కేది ఎప్పుడని అభిమానులు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా `సలార్ 2` పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ మేకర్స్ ఇచ్చే అవకాశం ఉందని లీకైంది. స్పెషల్ అనౌన్స్ మెంట్ పేరుతో ఫ్యాన్స్ కిక్ ఇచ్చే విషయం చెప్పాలని భావిస్తున్నారట.
మరి ఆ కిక్ ఇచ్చే అప్ డేట్ ఏంటో చూడాలి. సినిమా లాంచింగ్ డేట్? లేదా? రిలీజ్ తేదీ? లాంటిది ఏదైనా చెబుతురా? మరో కొత్త విషయంతో ముందుకొస్తారా? అన్నది చూడాలి. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.