సలార్ : వీక్ డేస్ లో బెనిఫిట్ షోలు ఏంటో? హౌస్ ఫుల్ ఏంటో?
ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫామ్ లో హిందీ వర్షన్ సలార్ కి నేడు మరియు రేపు ఉదయం అయిదు, ఆరు గంటల షో లు వేయబోతున్నట్లుగా చూపిస్తుంది
పెద్ద హీరోల సినిమాలకు మొదటి రోజు లేదా మొదటి రెండు మూడు రోజుల వరకు బెనిఫిట్ షో లు వేయడం, వాటికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ రావడం కామన్ విషయం. కానీ వీక్ డేస్ లో అది కూడా రెండో వారం లో బెనిఫిట్ షో లు వేయడం, ఆ షో లు హౌస్ ఫుల్ అన్నట్లుగా చూపించడం విడ్డూరంగా ఉంది అంటూ యాంటి ప్రభాస్ ఫ్యాన్స్ 'సలార్' మేకర్స్ పై కామెంట్స్ చేస్తున్నారు.
ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫామ్ లో హిందీ వర్షన్ సలార్ కి నేడు మరియు రేపు ఉదయం అయిదు, ఆరు గంటల షో లు వేయబోతున్నట్లుగా చూపిస్తుంది. అంతే కాకుండా ఆ షో లకు సంబంధించిన టికెట్లు అన్నీ కూడా అమ్ముడు పోయినట్లుగా అందులో చూపించారు. దాంతో ఇదంతా కూడా వసూళ్లు పెంచి చూపించేందుకు అనే ఆరోపణలు వస్తున్నాయి.
అవకాశం ఎదురు చూస్తున్న షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ మరియు బాలీవుడ్ వర్గాల వారు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సలార్ సినిమా కు బుధ మరియు గురు వారాల్లో బెనిఫిట్ షో లు వేయడం, అవి హౌస్ ఫుల్ అవ్వడం విడ్డూరంగా ఉంది.. ఇది ఎంతవరకు నిజం అన్నట్టుగా వారు ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబై తో పాటు ఉత్తరాదికి చెందిన పలు ముఖ్య పట్టణాల్లోని మల్టీ ప్లెక్స్ ల బుకింగ్ విషయంలో ఇదే జరిగింది. ఆ మార్నింగ్ షో కు సంబంధించిన బుకింగ్ ఓపెన్ అవ్వకుండానే హౌస్ ఫుల్ అయ్యాయి అంటున్నారు. ఇది కచ్చితంగా కలెక్షన్స్ ను భారీగా చెప్పడం కోసం అంటూ బాలీవుడ్ మీడియా సర్కిల్స్ వారు ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై ఇప్పటి వరకు హిందీలో పంపిణీ చేసిన బయ్యర్లు కానీ, నిర్మాణ సంస్థ హోంబాలే ప్రతినిధులు, సదరు ఆన్ లైన్ టికెట్ బుకింగ్ యాప్ ప్రతినిధులు స్పందించలేదు. వీకెండ్స్ లో ఉదయం ఆటలు వేయడం, హౌస్ ఫుల్ అవ్వడం పర్వాలేదు కానీ... వీక్ డేస్ లో బెనిఫిట్ షో లు వేయడం ఏంటో..? ఆ బెనిఫిట్ షో లు హౌస్ ఫుల్ అవ్వడం ఏంటో అన్నట్టు కొందరు విమర్శలు చేస్తున్నారు.