సలార్.. ఈసారి కఠిన నిబంధనలు

ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమాలైన 18 ఏళ్ళు లోపు వారిని అనుమతించకూడదు అనే నిబంధన ఉంది. గతంలో చాలా సినిమాలకి ఈ నిబంధనని పెద్దగా అమలు చేసిన దాఖలాలు లేవు.

Update: 2023-12-26 04:11 GMT

డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం సలార్. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. అయితే వీకెండ్ లో పెరగాల్సిన కలెక్షన్స్ మొదటి రోజు తో పోల్చుకుంటే తగ్గుతూ వెళ్తున్నాయి. చాలా చిత్రాలు శుక్రవారం కంటే శనివారం, ఆదివారం కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే సలార్ సినిమాకి మాత్రం క్రమంగా తగ్గుతున్నాయి.

దీనికి కారణం మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో కఠినంగా అమలు చేస్తున్న నిబంధనలు అని సమాచారం. సలార్ సినిమాకి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమాలైన 18 ఏళ్ళు లోపు వారిని అనుమతించకూడదు అనే నిబంధన ఉంది. గతంలో చాలా సినిమాలకి ఈ నిబంధనని పెద్దగా అమలు చేసిన దాఖలాలు లేవు. ఏదో చూసిచూడనట్లు వదిలేవేసేవారు.

తెలుగులో స్టార్ హీరోల అభిమానుల్లో టీనేజ్ పిల్లలు కూడా ఉంటారు. అయితే ఈ నిబంధన పెద్దగా అమల్లో లేకపోవడం వలన అందరూ వెళ్లి చూసేసేవారు. అయితే సలార్ మూవీకి వచ్చేసరికి మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో సెన్సార్ నిబంధనలని కఠినంగా అమలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు చిన్న పిల్లలతో వస్తే అస్సలు లోపలి పంపించడం లేదు.

టికెట్ తీసుకునే సమయంలో కూడా వయస్సు నిబంధనలు కచ్చితంగా చూస్తున్నారు. 18 ఏళ్ళ లోపు వారికి టికెట్లు ఇవ్వడం లేదు. తల్లిదండ్రులు థియేటర్స్ నిర్వాహకులతో గొడవ పడుతున్న లోపలి పంపించడం లేదు. అలాగే డబ్బులు కూడా వాపస్ ఇవ్వడం లేదు. ఈ నిబంధనలు కారణంగా సలార్ కలెక్షన్స్ పై కొంత ప్రభావం చూపిస్తున్నాయనే మాట వినిపిస్తోంది.

సెన్సార్ వారు కొన్ని కట్స్ సూచించి యూ/ ఏ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. అయితే ప్రభాస్ ఏ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పారు. నాకు కూడా కట్స్ లేకుండా చూడటం కరెక్ట్ అనిపించి ఏ సర్టిఫికేట్ తీసుకున్నా అని ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఏ సర్టిఫికేట్ ఇవ్వడంపై ముందుగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ ఏ సర్టిఫికేట్ ఉండటం వలన మల్టీప్లెక్స్ దగ్గర కతినంగా నిబంధనలు అమలు చేస్తూ 18 ఏళ్ళ లోపు ఉన్నవారిని అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News