ఆమె గురించి పిల్లలకు ముందే చెప్పాను: సలీంఖాన్
సలీం ఖాన్ ఇంట్లో పిల్లలంతా ఇప్పటికీ ఆమెను హెలెన్ ఆంటీ అని పిలుస్తారట.
భార్య ఉండగానే రెండో యువతి జీవితంలోకి ప్రవేశిస్తే ఎంత హారిబుల్ గా ఉంటుందో నిజ జీవితంలో చూస్తున్నవారు ఎందరో. కానీ ఈ స్టార్ రైటర్ మాత్రం తెలివిగా మ్యానేజ్ చేసేసాడు. ఆ విషయాన్ని ఓపెన్ గా అంగీకరించాడు. హెలెన్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత సల్మాన్ ఖాన్ తండ్రి సలీంఖాన్ ఎలా మేనేజ్ చేసారో తాజా డాక్యు సిరీస్ లో వెల్లడించారు. సలీం ఖాన్‌పై సల్మాన్ తల్లి సల్మా ఖాన్ తన పిల్లలను ఎప్పుడూ ప్రభావితం చేయలేదని అర్బాజ్ ఖాన్ (సల్మాన్ సోదరుడు) ఈ సిరీస్ లో వెల్లడించాడు. సలీం ఖాన్ ఇంట్లో పిల్లలంతా ఇప్పటికీ ఆమెను హెలెన్ ఆంటీ అని పిలుస్తారట.
బాలీవుడ్ పాపులర్ రచయితల ద్వయం సలీం-జావేద్‌ల డాక్యుమెంట్-సిరీస్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయిన సంగతి తెలిసిందే. `యాంగ్రీ యంగ్ మెన్` అనేది టైటిల్. ఇందులో మూడవ ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ తండ్రి అయిన సలీం ఖాన్ రెండో భార్య హెలెన్ గురించి పరిచయం ఉంది. సలీం ఖాన్ తన పిల్లలు సల్మాన్, ఆర్భాజ్ తప్పుగా అర్థం చేసుకోకుండా వారిని కూచోబెట్టి మాట్లాడారట. అర్బాజ్ ఖాన్ తన తల్లి సల్మా ఖాన్ హెలెన్ లేదా తండ్రి సలీమ్ గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడలేదని వెల్లడించారు. మా నాన్నకు వ్యతిరేకంగా ఏదైనా ఆలోచించడానికి లేదా మాట్లాడటానికి మా అమ్మ ఎప్పుడూ మమ్మల్ని ప్రభావితం చేయలేదు. ఆమెకు కష్టాలు ఉన్నాయి.. కానీ `మీ నాన్న ఇలాగే ఉన్నాడు` లేదా ఇలా చేస్తున్నాడేమిటి? అని ఆలోచించేలా అమ్మ మమ్మల్ని ఎప్పుడూ ప్రభావితం చేయలేదు.. అని అన్నారు. పిల్లలంతా హెలెన్ ను ఆంటీ అని పిలిచేవారమని తెలిపాడు ఆర్భాజ్. ఎందుకంటే ఆమె మా జీవితంలోకి ప్రవేశించినప్పుడు అలా పిలిచామని అన్నారు. ఆమెను తల్లిలా చూసుకున్నా కానీ `హెలెన్ ఆంటీ` అని పిలుస్తాము. ఆమె మా జీవితంలో భాగం అని ఆర్భాజ్ అన్నారు.
సల్మాన్, ఆర్భాజ్ ల తండ్రి సలీం ఖాన్ 1964లో సుశికా చరక్ (ప్రస్తుతం సల్మా ఖాన్)ని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు - ముగ్గురు కుమారులు సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, కుమార్తె అల్విరా ఉన్నారు. సలీం 1981లో హెలెన్ రిచర్డ్‌సన్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ అర్పిత అనే ఆడ శిశువును దత్తత తీసుకున్నారు. డాక్యు-సిరీస్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. సలీం ఖాన్ తన కుటుంబానికి హెలెన్ గురించిన వార్తను మొదటిసారిగా తెలియజేసిన సమయాన్ని కూడా గుర్తుచేసుకున్నాడు.
నేను పిల్లలందరినీ కూర్చోబెట్టి వారితో చర్చించాను. నేను వారితో ``మీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ మీరు పెద్దయ్యాక అర్థం చేసుకుంటారు. నేను హెలెన్ ఆంటీతో ప్రేమలో ఉన్నాను. మీరు మీ తల్లిని ప్రేమిస్తున్నంతగా మీరు ఆమెను ప్రేమించలేరని నాకు తెలుసు.. కానీ ఆమెపై నాకు అదే గౌరవం కావాలి`` అని చెప్పానని సలీం ఖాన్ అన్నారు. సలీం -హెలెన్ మొదట కబ్లీ ఖాన్ సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ సినిమాలో సలీం విలన్ గా నటించగా..హెలెన్ హీరోయిన్‌గా నటించింది. అయితే వీరిద్దరూ సెట్స్‌లో ఎప్పుడూ మాట్లాడుకోలేదు. వారు మళ్లీ అమితాబ్ బచ్చన్ డాన్ సెట్స్ లో కలిసారు. మాటా మాటా కలిసాక ప్రేమలో పడ్డారు.