మలైకాకు సల్మాన్ కానుక మీనింగ్?
ఇదే సంతోషంలో అతడు మలైకాను కూడా క్షమించేసినట్టు అర్థమవుతోంది. దానికి సింబాలిక్ గా అతడు మలైకాకు క్రిస్మస్ కానుకలు పంపాడు.
దాదాపు 18 ఏళ్ల వివాహబంధాన్ని తెంచుకుని మలైకా అరోరా .. భర్త అర్భాజ్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటికే మలైకా ప్రేమలో ఉంది. బోనీ కపూర్ కుమారుడు, యువహీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేయడంపై వార్తలు వస్తున్నాయి. ఆ సమయంలో అర్భాజ్ సోదరుడైన సల్మాన్ ఖాన్ .. మలైకా నిర్వాకంపై చాలా కోపంగా ఉన్నాడని కూడా ప్రచారమైంది. బోనీ కపూర్ సైతం సుపుత్రుడు చేసిన ఘనకార్యానికి సల్మాన్, అతడి కుటుంబంతో అనుబంధం దెబ్బ తిందని వాపోయినట్టు ముంబై మీడియా కథనాలు వెలువరించింది. ఆ తర్వాత విదేశీ భామ జార్జియాతో ఆర్భాజ్ డేటింగ్ .. బ్రేకప్ .. అనంతరం కొన్నేళ్లకు లేటెస్టుగా మేకప్ ఉమెన్ షురాతో పెళ్లి గురించి తెలిసిందే.
అదంతా అటుంచితే వర్తమానంలో మలైకాతో సల్మాన్ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? అన్నది ఆరా తీస్తే తెలిసిన సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి. తన అన్న అర్భాజ్ ఖాన్ రెండో పెళ్లితో సల్మాన్ భాయ్ ఇప్పుడు ఎంతో శాంతంగా ఉన్నాడు. ఆనంద డోలికల్లో మునిగి తేల్తున్నాడు. ఇదే సంతోషంలో అతడు మలైకాను కూడా క్షమించేసినట్టు అర్థమవుతోంది. దానికి సింబాలిక్ గా అతడు మలైకాకు క్రిస్మస్ కానుకలు పంపాడు. ఈ గిఫ్ట్ తో పాటు అతడు ఒక నోట్ కూడా పంపాడని తెలిసింది.
అయితే ఆ నోట్ లో ఏం ఉంది? అంటే మలైకాకు ప్రత్యేకించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన సల్మాన్ భాయ్ తమ ఇంట్లో అంతా హ్యాపీగా ఉందని రాసాడు. మీకు క్రిస్మస్ అండ్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీ స్నేహం మద్ధతుకు మా ప్రశంసలకు చిహ్నంగా మేం ఈ చిన్న అడ్డంకిని సృష్టించాం. మీ ఉనికి మాకు వెలుగులు పంచినట్టే, ఇకపైనా మీ ముఖంలో చిరునవ్వు కనిపించాలి" అని సల్మాన్ నోట్ లో రాసాడు. ఈ లేఖలో సల్మాన్ తన మనసును ఆవిష్కరించాడు.
అర్బాజ్, షురా ఖాన్ జంట పెళ్లి వారి సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో జరిగింది. ఈ పెళ్లికి కొద్దిమంది బంధుమిత్రులు కుటుంబం మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ పెళ్లికి మలైకా రాలేదు కానీ, తన కుమారుడు అర్హన్ ఖాన్ ని పంపించింది. అర్హాన్ ఖాన్ ఈ వేడుకలో గిటార్ ప్లే చేస్తూ ఎంతో జోష్ ఫుల్ గా కనిపించగా, అర్భాజ్ అతడి పెర్ఫామెన్స్ ను వీడియో తీస్తూ కనిపించాడు. తండ్రి కొడుకుల అనుబంధం ఎంతగానో చర్చకు వచ్చింది.