బ్లాక్ మోనోకినిలో సమంత దుమారం
మెరుపులా మెరిసి.. ఉరుములా విరుచుకుపడటం ఎలానో సమంతకే తెలుసు. ఒడిదుడుకులు తనకు ఏ విధంగాను అడ్డంకి కాలేవని నిరూపిస్తూ ముందుకు దూసుకుపోతోంది.
మెరుపులా మెరిసి.. ఉరుములా విరుచుకుపడటం ఎలానో సమంతకే తెలుసు. ఒడిదుడుకులు తనకు ఏ విధంగాను అడ్డంకి కాలేవని నిరూపిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఫ్యాషన్ ప్రపంచంలో రారాణి అని నిరూపించింది. ఇదిగో ఇప్పుడు తనలోని సిసలైన ఫ్యాషనిస్టా నిదుర లేచింది. తలచినదే తడవుగా వేడెక్కించే ఫోటోషూట్ తో అగ్గి రాజేసింది. ప్రఖ్యాత హార్పర్స్ బజార్ కవర్ పేజీపై విభిన్నమైన ఫోటోషూట్ తో అదరగొట్టింది. సమంతను రకరకాల కోణాల్లో ఆవిష్కరించిన ఈ ఫోటోషూట్ ఇప్పుడు యూత్ లో హాట్ టాపిక్.
తాజాగా బ్లాక్ మోనోకినిలో సమంత స్పెషల్ లుక్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. కొంత గ్యాప్ తర్వాత సమంత మరోసారి విశ్వరూపం చూపించింది. ఫోటోషూట్లలో రాణి అని నిరూపించింది. బ్లాక్ మోనోకినికి కాంబినేషన్ గా విలాసవంతమైన విట్టన్ బ్రాస్‌లెట్‌తో.. లైటర్ జువెలరీ ఎంపికతో సామ్ ఎంతో స్పెషల్ గా కనిపించింది. మరొక ఫోటోలో డెనిమ్ జంప్‌సూట్ లో సమంత రాకింగ్ అనిపించింది.
బ్లాక్ మోనోకిని ఎంత స్ట్రైకింగ్ గా ఉందో, అంతకుమించి డిజైనర్ లుక్స్ తో హృదయాల్ని దోచుకుంది.
బ్రాలెస్ లూయిస్ విట్టన్ షర్ట్ లో సమంత యూనిక్ స్టైల్ యువతరంలోకి దూసుకెళ్లింది. అలాగే గోధుమ రంగు లూయిస్ విట్టన్ బ్లేజర్- బ్లాక్ లెదర్ ప్యాంటుతో స్పెషల్ గా కనిపించింది ఒక లుక్‌లో. ఈ ఫోటోషూట్ ఆద్యంతం క్లాసీ భంగిమలతో సామ్ సంథింగ్ సంథింగ్ అని నిరూపించింది. స్మోకీ ఐస్.. చాక్లెట్ లిప్‌స్టిక్ తో సమంత కొత్త రూపం యువతరం హృదయాల్ని టచ్ చేసింది.
ఖుషి సినిమా తర్వాత సమంత దృష్టి పూర్తిగా బాలీవుడ్ వైపు ఉందన్న ప్రచారం సాగుతోంది. అక్కడ అగ్రహీరోల సరసన అవకాశాల కోసం వేచి చూస్తోంది. ఇటీవలే సల్మాన్ భాయ్ సరసన నటించే అవకాశం ఉందని కూడా కథనాలొచ్చాయి. మరోవైపు రాజ్ అండ్ డీకేతో కలిసి మరో క్రేజీ ప్రాజెక్టుకు పని చేసే వీలుందని కూడా తెలిసింది.