మేడమ్ 'సార్' మేడమ్ అంతే.. బ్యూటిఫుల్ సంయుక్త!
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను అస్సలు డిస్సపాయింట్ చేయదు సంయుక్త మీనన్
గోల్డెన్ బ్యూటీ.. అదేనండీ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఆమె తెలుగులో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ అయ్యాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది అమ్మడు. నాన్ స్టాప్ షూటింగ్స్ లో పాల్గొంటూ సినీ ప్రియులను తన చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల బాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది.
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను అస్సలు డిస్సపాయింట్ చేయదు సంయుక్త మీనన్. ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటోంది. కెరీర్ తో పాటు తన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. క్రమంగా తన ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. క్రేజీ ఔట్ ఫిట్స్ లో మెరుస్తుంటోంది. శారీల్లో ఎక్కువగా అందాలు ఆరబోస్తుంటోంది సంయుక్త మీనన్.
తాజాగా పింక్ కలర్ శారీలో సంయుక్త తళుక్కుమంది. ప్లెయిన్ కలర్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్న బ్యూటీ.. ఓ షాపింగ్ మాల్ కు వెళ్లింది. అక్కడ కాఫీ తాగుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. సింపుల్ మేకప్ తో, హెయిర్ లీవ్ చేసి కుర్రాళ్లను ఫ్లాట్ చేస్తోంది. వయ్యారంగా కూర్చుని ఫిదా చేస్తోంది. ఓరగా చూస్తూ మాయ చేస్తోంది. ఆమె టాటూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. చెప్పాలంటే గులాబీ రంగు చీరలో సంయుక్త మీనన్ గార్జియస్ గా ఉంది.
ప్రస్తుతం ఆమె పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. అందాల దేవత అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పింక్ రోజ్ అంటూ కొనియాడుతున్నారు. బ్యూటినెస్ కు సంయుక్త ఇమేజ్ అని పొగిడేస్తున్నారు. చీరలో సంయుక్త అందాల జాతర అని చెబుతున్నారు. మేడమ్ సార్.. మేడమ్ అంతే అంటూ బ్యూటీని ఆకాశానికెత్తేస్తున్నారు. అమ్మడి నయా పిక్స్ కు లైకుల వర్షం కురిపిస్తున్నారు. తెగ రీషేర్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్త.. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత సార్ సినిమాతో భారీ హిట్ ను అందుకుంది మలయాళ కుట్టి. బింబిసార, డెవిల్ సినిమాలతో మంచి హిట్స్ ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగులో స్వయంభు, బాలీవుడ్ లో మహారగ్ని, మాలీవుడ్ లో అనేక మూవీలు చేస్తోంది. మరి సంయుక్త వరుస చిత్రాలతో ఎలా అలరిస్తుందో చూడాలి.