రష్మిక కులాంతర వివాహంపై క్లారిటీ!
రణబీర్ కపూర్ -రష్మిక మందన్న నటించిన యాక్షన్ డ్రామా 'యానిమల్' ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది
రణబీర్ కపూర్ -రష్మిక మందన్న నటించిన యాక్షన్ డ్రామా 'యానిమల్' ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. విమర్శలు ఎన్ని ఎదురైనా అవన్నీ బాక్సాఫీస్ కలశంలో కాసులుగా మారాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఘాడమైన ఇంటెన్స్ సన్నివేశాలతో రక్తి కట్టించడమే ఈ విజయానికి కారణం. అయితే వీటిలో కొన్నిటి గురించి సందీప్ వంగా తాజాగా వివరణ ఇచ్చాడు. రణబీర్- రష్మిక జంట కులాంతర వివాహాన్ని తెరపై చూపించడానికి కారణాలను, రణ్ విజయ్ (రణబీర్)కి సోదరుడే అయిన శిక్కు కుటుంబీకుడు అబ్రార్ ముస్లిమ్ గా ఎందుకు మారాడు? అనే విషయాలను కూడా అతడు ప్రస్థావించాడు.
ముఖ్యంగా రణబీర్-రష్మిక కులాంతర వివాహం ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదని సందీప్ వంగా అన్నారు. రణబీర్- రష్మిక వారి కుటుంబం ముందు ఘాటైన లిప్ లాక్ వేయడంపైనా ప్రశ్నించగా.. అది యువజంట నిర్లక్ష్యమని అన్నాడు సందీప్. బ్యాక్‌గ్రౌండ్‌లో రాక్ సాంగ్ ప్లే అవుతుంటే... వారిలో ఒక నిర్లక్ష్యం ఉంది. వారు తమ ఆవేశాన్ని బయటపెడుతున్నట్లు మనకు అనిపిస్తుంది. అందులో కాస్త నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది'' అన్నారాయన.
బాబీ డియోల్ పాత్రను ముస్లింగా మార్చడంపైనా సందీప్ రెడ్డి వంగా వివరణ ఇచ్చారు. ''ఇస్లాం క్రైస్తవ మతంలోకి చాలా మంది ప్రజలు మారడం మనం చూస్తున్నాం. ఎవరూ హిందూ మతంలోకి మారడం మనం చూడలేదు. కాబట్టి నేను దీన్ని ఉపయోగించాలని అనుకున్నాను. ఎందుకంటే మీరు ఇస్లాంలో ఒకరికి మించి ఎక్కువమంది భార్యలను పొందవచ్చు. విభిన్న ముఖాలతో ఫ్యామిలీలో ఒకరికి మించి దాయాది పాత్రలకు ఆస్కారం ఉంది. డ్రామా పెద్దదిగా ఉంటుంది. అది ఒక్కటే కారణం... ముస్లింను చెడుగా చూపించే ఉద్దేశ్యం లేదు..'' అని సందీప్ వంగా అన్నారు.
యానిమల్ భారీ తారాగణంతో హై స్టాండార్డ్స్ లో రూపొందింది. రణబీర్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్, అనిల్ కపూర్, సలోని బాత్రా, ట్రిప్తీ డిమ్రీ, సురేష్ ఒబెరాయ్ , శక్తి కపూర్ తదితరులు నటించారు. యానిమల్ సక్సెస్ తో మరోసారి కబీర్ సింగ్ దర్శకుడు సందీప్ వంగా పనితనంపై ప్రశంసలు కురిసాయి. దాదాపు 850కోట్ల వసూళ్లతో యానిమల్ సంచలన విజయం సాధించడంతో అన్ని విమర్శలు వెనక్కి వెళ్లాయి.