సంక్రాంతి వినోదం పరిపూర్ణమేనా?

ఇక మూడు చిత్రాల్లో ఏది ఎలా ఉంటుందో అన్న సందేహాలు మొన్నటిదాకా ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే మూడూ ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి.

Update: 2025-01-07 05:40 GMT

ఈసారి సంక్రాంతి ముంగిట సినీ రంగంలో పెద్దగా గందరగోళం లేదు. ముఖ్యంగా థియేటర్ల గొడవ ఏమాత్రం కనిపించడం లేదు. గతంలో చాలా సందర్భాల్లో మూడుకు మించి సినిమాలు రిలీజయ్యేవి. వీటికి తోడు డబ్బింగ్ సినిమాల పోటీ ఉండేది. థియేటర్ల సర్దుబాటు విషయంలో గజిబిజి జరిగేది. కానీ ఈసారి మూడు సినిమాలే రిలీజవుతున్నాయి. పైగా డబ్బింగ్ సినిమాల గోలే లేదు.

Full View

రిలీజవుతున్న మూడు చిత్రాల్లో రెండు దిల్ రాజు ప్రొడ్యూస్ చేసినవి. మూడో చిత్రాన్ని ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. దీంతో గందరగోళానికి, వివాదానికి ఆస్కారమే లేకపోయింది. ఇక మూడు చిత్రాల్లో ఏది ఎలా ఉంటుందో అన్న సందేహాలు మొన్నటిదాకా ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే మూడూ ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి. మూడూ సక్సెస్ అయితే ఆశ్చర్యం లేదనిపిస్తోంది.

Full View

సంక్రాంతికి రానున్న మూడు సినిమాలు రెండు రెండు రోజుల గ్యాప్‌లో రాబోతుండగా.. ట్రైలర్లను కూడా అదే గ్యాప్‌తో రిలీజ్ చేయడం విశేషం ముందుగా జనవరి 2న ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ వచ్చింది. అంతకుముందు దాకా ఈ సినిమా కంటెంట్ మీద కొంచెం సందేహాలున్నాయి. అనుకున్నంత బజ్ కనిపించలేదు. కానీ ట్రైలర్ ఆకర్షణీయంగా ఉండడంతో ఆటోమేటిగ్గా బజ్ పెరిగింది. ఇది పక్కా బిగ్ స్క్రీన్ కమర్షియల్ ఎంటర్టైనర్‌లా కనిపిస్తోంది.

Full View

ఇక ‘డాకు మహారాజ్’కు కూడా లో బజ్ సమస్యగా మారింది. కానీ దీని ట్రైలర్ మాస్‌కు ఫుల్ మీల్స్ గ్యారెంటీ అనే సంకేతాలు ఇచ్చింది. ఇక చివరగా రిలీజైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్.. ముందు నుంచే ఈ సినిమాపై ఉన్న పాజిటివ్‌ బజ్‌ను ఇంకా పెంచింది. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. వెంకీ, అనిల్ రావిపూడి మార్కు ఎంటర్టైన్మెంట్‌తో సంక్రాంతి సినిమా సంబరం పీక్స్‌కు చేరేలా ఉంది. ట్రైలర్లతో పెరిగిన అంచనాలకు తగ్గట్లే సినిమాలు కూడా ఉంటే ఈ సంక్రాంతికి హండ్రెడ్ పర్సంట్ సక్సెస్‌తో బాక్సాఫీస్ మోత మోగిపోవడం ఖాయం.

Tags:    

Similar News