5వ రోజు బాక్సాఫీస్.. ప్రభాస్ సినిమాలను కొట్టేసిన వెంకీ!

సంక్రాంతి పండగ సీజన్‌లో సినిమా మాస్ ఆడియన్స్‌కు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ కావడం సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది.

Update: 2025-01-20 05:33 GMT

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. కుటుంబ ప్రేక్షకుల్ని ఆకర్షించే ఎమోషనల్ కథతో పాటు పక్కా ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకు భారీ విజయాన్ని అందించింది. సంక్రాంతి పండగ సీజన్‌లో సినిమా మాస్ ఆడియన్స్‌కు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ కావడం సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది.

ఇక ఈ సినిమా 5వ రోజుకి రాబట్టిన కలెక్షన్లు ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచాయి. తెలుగు రాష్ట్రాల్లో మామూలు మధ్యస్థాయి బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా పోటీ ఇచ్చి సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు అత్యధిక షేర్ సాధించిన సినిమాల జాబితాలో రెండో స్థానానికి "సంక్రాంతికి వస్తున్నాం" చేరడం ఈ సినిమా విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది.

సినిమా 5వ రోజు మొత్తం 12.75 కోట్ల షేర్ రాబట్టి, "ఆర్ ఆర్ ఆర్" తర్వాత టాప్ 2 స్థానంలో నిలిచింది. ఇక ఇది బహు భాషా చిత్రాలతో పాటు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లను అధిగమించి ఈ స్థాయికి చేరడం నిజంగా సాధారణ విషయం కాదు. ముఖ్యంగా ప్రభాస్ బాహుబలి 2, కల్కి 2, సలార్ కలెక్షన్ల కంటే హై రేంజ్ లో రావడం విశేషం. తెలుగునాట వెంకటేష్ అభిమానులకు మంచి కిక్కిచ్చే న్యూస్ అని చెప్పవచ్చు.

ఇక 5వ రోజున 10 కోట్లకు పైగా షేర్ సాధించిన సినిమాలు చాలా తక్కువ. అలాంటి టాప్ లిస్ట్‌లో "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా చేరడం మేకర్స్‌కు మరో అచివ్ మెంట్. పెద్ద బడ్జెట్ సినిమాలతో పోటీగా ఉండటం, ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ పొందడం ఈ చిత్రానికి లభించిన విజయాన్ని తెలియజేస్తుంది. ఇక ఈ సినిమా 5వ రోజు సాధించిన కలెక్షన్ల జాబితా ఇలా ఉంది:

ఆర్ఆర్ఆర్ - 13.63 కోట్ల షేర్

సంక్రాంతికి వస్తున్నాం - 12.75 కోట్ల షేర్

అల వైకుంఠపురములో - 11.43 కోట్ల షేర్

బాహుబలి 2 - 11.35 కోట్ల షేర్

కల్కి 2898 ఎడీ - 10.86 కోట్ల షేర్

సలార్ - 10.00 కోట్ల షేర్

సరిలేరు నీకెవ్వరు - 9.69 కోట్ల షేర్

పుష్ప 2 ది రూల్ - 9.02 కోట్ల షేర్

వాల్తేర్ వీరయ్య - 8.80 కోట్ల షేర్

సైరా నరసింహారెడ్డి - 8.33 కోట్ల షేర్

వకీల్ సాబ్ - 8.30 కోట్ల షేర్

గుంటూరు కారం - 7.32 కోట్ల షేర్

భీమ్లా నాయక్ - 7.25 కోట్ల షేర్

వీరసింహారెడ్డి - 6.25 కోట్ల షేర్

దేవర పార్ట్ 1 - 6.07 కోట్ల షేర్

హనుమాన్ - 6.04 కోట్ల షేర్

Tags:    

Similar News