సంక్రాంతికి వస్తున్నాం.. ప్రీమియర్ ప్రీసేల్స్ ఎలా ఉన్నాయంటే?

ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం ఈ మూవీ ప్రీసేల్స్ ద్వారా 44,996 డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి.

Update: 2025-01-06 11:55 GMT

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం జనవరి 14న థియేటర్స్ లోకి వస్తోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి ప్రేక్షకుల ముందుకొచ్చిన సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

కచ్చితంగా సంక్రాంతి పొంగల్ హాలిడేకి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో థియేటర్స్ కి రప్పించేలా ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ వేస్తున్నారు. మరీ పాన్ ఇండియా రేంజ్ సినిమాల తరహాలో కాకపోయిన ఏ ప్రీమియర్ షోలకి అడ్వాన్స్ బుకింగ్స్ కి బాగానే రెస్పాన్స్ వస్తోంది.

జనవరి 13న నార్త్ అమెరికాలో సినిమాకి ప్రీమియర్ షోలు వేయబోతున్నారు. ఈ ప్రీమియర్ షోల ప్రీసేల్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం ఈ మూవీ ప్రీసేల్స్ ద్వారా 44,996 డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 2537 టికెట్లు అమ్ముడయ్యాయి. కెనడాలో కూడా ప్రీబుకింగ్స్ ఓపెన్ చేసినట్లు 148 లొకేషన్స్ లలో 424 షోలలో ఈ మూవీ ప్రీమియర్స్ వేయబోతున్నారు.

సినిమా రిలీజ్ కి ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉంది. ఈ మూవీ ట్రైలర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితే అడ్వాన్స్ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి రేసులో రిలీజ్ అవుతోన్న మూడు సినిమాలపైన అంచనాలు భారీగానే ఉన్నాయి. మూడు విభిన్నమైన జోనర్స్ లలో ఈ చిత్రాలు వస్తున్నాయి. దీంతో కచ్చితం మూవీస్ మంచి ప్రేక్షాకాదరణ సొంతం చేసుకునే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

అలాగే ఒక్కో సినిమా రెండు రోజుల గ్యాప్ లో రిలీజ్ అవుతోంది. ఇక విక్టరీ వెంకటేష్ సినిమాలలో ఎంటర్టైన్మెంట్స్ ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతాయనే నమ్మకం అభిమానులలో ఉన్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో కూడా అనిల్ రావిపూడి వీలైనంత వినోదాన్ని పండించే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రంలో వెంకటేష్ కి జోడీగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. వారి మధ్యలో నడిచే కథ అంతా వినోదాత్మకంగా ఉండబోతోందని అనుకుంటున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో ఉన్న అనిల్ రావిపూడి ఈ చిత్రంతో మరో హిట్ ని తనఖాతాలో వేసుకుంటాడేమో అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News